చంద్రబాబు, పవన్ ను "ఫిక్స్" చేసిన రేవంత్ - "గేమ్ ఛేంజర్"..!!

అల్లు అర్జున్ - తెలంగాణ ప్రభుత్వం ఎపిసోడ్ ఆసక్తి కర మలుపులు తిరుగుతోంది. సంధ్యా ధియే టర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్ పైన బయటకు వచ్చారు. అసెంబ్లీలోని రేవంత్ ఈ కేసు గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో, తెలంగాణలో బెనిఫిట్ షో లు..టికెట్ ధరల పెంపు ఇక ఉండవని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతోంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల వేళ ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆసక్తి కరంగా మారుతోంది.

రేవంత్ నిర్ణయంతో
తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షో ల పైన సంచలన నిర్ణయం తీసుకుంది. పుష్ఫ -2 సినిమా విడుదల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభు త్వాలు అనుమతి ఇచ్చాయి. బెనిఫిట్ షో లకు అనుమతి లభించింది. కానీ, సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటన.. తదనంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్ షో లు ఉండవని.. టికెట్ ధరలు పెంచమని తేల్చి చెప్పింది. ఇక, పుష్ఫ -2 కోసం పెంచిన టికెట్ ధరలు సామాన్య ప్రజానీకానికి అందుబాటు లో లేకుండా పోయాయనే విమర్శ ఉంది. దీంతో, రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సామాన్యుల నుంచి మద్దతు లభిస్తోంది.

Revanth Govt decision over benefit shows and Ticket rate hike leads new pressure for AP Govt

ఏపీ ప్రభుత్వం పై ఒత్తిడి
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోలకు ఏపీ, తెలంగాణ పెద్ద మార్కెట్ గా ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. పొరుగు రాష్ట్రంలో సినీ పరిశ్రమ విషయంలో సామాన్యులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుం టున్న వేళ ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షో లు.. టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇస్తే విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లే అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో.. ఇప్పుడు రేవంత్ నిర్ణయం ఏపీ సీఎం చంద్రబాబు .. డిప్యూటీ సీఎం పవన్ ను ఒక విధంగా ఇరకాటంలోకి నెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బెనిఫిట్ షో ..టికెట్ ధరల పైన సానుకూలం గా స్పందిస్తూ వస్తోంది.

చెర్రీ - బాలయ్య సినిమాల వేళ
ఇప్పటి వరకు అల్లు అర్జున్ వివాదం పైన పవన్ కల్యాణ్ ఓపెన్ గా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సినీ పరిశ్రమ బాధిత కుటుంబానికి కాకుండా అల్లు అర్జున్ ను పరామర్శించటం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక, సంక్రాంతి వేళ రాం చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ తో పాటుగా ఇతర హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. రాం చరణ్ డిప్యూటీ సీఎం పవన్ కు .. బాలయ్య సీఎం చంద్రబాబుకు బంధువులు. ఇప్పుడు రేవంత్ తరహాలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సినీ ప్రముఖుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అదే విధంగా ప్రస్తుత పరిస్థితే కొనసాగిస్తే విమర్శలకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. దీంతో, ఇప్పుడు చంద్రబాబు.. పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+