నా లక్ష్యం సిఎం కావడం, కెసిఆర్ కూడా లేవరు: రేవంత్

హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం వెలమల రాజ్యం నడుస్తోందని, రేపటి నాడు రెడ్డి రాజ్యం వస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి గురువారం అన్నారు. తన లక్ష్యమైతే 2019లో సిఎం కుర్చీని ఎక్కడమేనని, మిగతా పదవుల్లో ఎవరున్నా సరే.. తనకు మాత్రం సిఎం కుర్చీ చాలు అన్నారు. తెలంగాణ శానన సభ లాబీల్లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణలో ఆలస్యంగా లేవడం అలవాటని, అందుకే ఉదయం పూట తాను ఎవరికి కలువనని ఆయన తెలిపారు. తానే కాదు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఉదయం పూట ఎవరిని కలవరని, ఆలస్యంగా లేవడం తెలంగాణ కల్చర్ అని రేవంత్ రెడ్డి అన్నారు.

 Revanth Reddy interesting comments in Assembly lobby

తెరాస పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లుగా లేదని, అన్ని పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లుగా ఉందన్నారు. శాసన సభలో చర్చలను ప్రతిపక్షాల తీవ్రంగా పరిగణించడం లేదన్నారు.

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసు పార్టీ సహా చర్చను ఎవరు తీవ్రంగా పరిగణించడం లేదన్నారు. తాను అప్పుడప్పుడు మాట్లాడుతున్నానని, తాను తప్ప మెరవ్వరూ సీరియస్‌గా మాట్లాడలేకపోతున్నారన్నారు. కుమ్మక్కు రాజకీయాలు సాగుతున్నాయా అని ప్రశ్నిస్తే... ఏమో.. ఎలా చెప్పగలమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+