'అతనూ రిషికేశ్వరితో అసభ్యంగా వ్యవహరించాడు, సిబిఐ దర్యాఫ్తు కావాలి'
గుంటూరు: తన కూతురు రిషికేశ్వరి ఆత్మహత్య ఘటన పైన సిబిఐతో దర్యాఫ్తు జరిపించాలని తండ్రి మురళీ కృష్ణ ఆదివారం డిమాండ్ చేశారు. ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్‌ను, అర్బన్ ఎస్బీని కలిసి వినతి పత్రం అందజేశారు. అభిషేక్ అనే విద్యార్థి కూడా తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించినట్లు డైరీలో ఉందని చెప్పారు.
దీని పైన కూడా విచారణ జరిపించాలని కోరారు. లైంగిక వేధింపులు, ర్యాగింగ్‌ను ప్రోత్సహించిన బాబురావును అరెస్టు చేయాలని కోరారు. కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఇవి పూర్తయ్యే వరకు పోలీసులు ఛార్జీషీటును దాఖలు చేయడాన్ని ఆపాలని కోరారు.
ర్యాగింగ్ నిరోధక చట్టంలోని అంశాలను పకడ్బంధీగా అమలు చేయాలని కోరారు. బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక ఆధారంగా బాబురావును విధుల నుంచి తొలగించారని, దీనిని ప్రాతిపదికగా తీసుకొని కేసు నమోదు చేయాలని కోరారు.

రిషికేశ్వరి మృతికి పది రోజుల ముందే వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసినా అప్పటి ప్రిన్సిపల్ బాబురావు పట్టించుకోలేదన్నారు. రిషికేశ్వరి మృతి చెందినట్లు వర్సిటీ వైద్యురాలు నిర్ధారించిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వకుండా జిజిహెచ్‌కు తరలించారన్నారు.
ప్రిన్సిపల్ మానసిక పరిస్థితి పైన గతంలో కళాశాల అధ్యాపకులు గవర్నర్‌కు లేఖ రాశారని మురళీ కృష్ణ కలెక్టర్, అర్బన్ ఎస్పీ దృష్టికి తీసుకు వచ్చారు. ఆయన ఆదివారం సాయంత్రం వారిని కలిశారు. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications