TTD: తిరుమలలో రికార్డు బ్రేక్, హుండీలో వంద కోట్లు, కోటి లడ్డూలు, సేవలు, టోకన్లు రద్దు
తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమలలో (Tirumala) శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు, గత నెలలో జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల (Brahmotsavam) సందర్బంగా భారీ సంఖ్యలో శ్రీవారి భక్తులు తిరుమల చేరుకుని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
గత సెప్టెంబర్ నెలలో తిరుమలలో (Tirumala) శ్రీవారిని 21 లక్షల మందికిపైగా దర్శించుకున్నారని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. గత నెలలో శ్రీవారికి హుండీ రూపంలో రూ 111. 65 కోట్ల ఆధాయం వచ్చిందని, 53. 84 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని, 8. 94 లక్షల మంది శ్రీవారికి (Tirumala) తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారని, 1, 11 కోట్ల లడ్డూలు విక్రయించామని శుక్రవారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియాకు చెప్పారు.

బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు: గత మాసం సెప్టెంబర్ 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు (Tirumala) విజయవంతంగా నిర్వహించామని, మళ్లీ అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల (Tirumala)అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం (Brahmotsavam) జరిగింది. ముందుగా టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Brahmotsavam)గత సెప్టెంబర్ 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారని, గరుడ సేవనాడు (Brahmotsavam)గ్యాలరీల బయట వేచి ఉన్న భక్తులను ఏడు ప్రత్యేక ప్రవేశమార్గాల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతించి ఎక్కువ మందికి సంతృప్తికర దర్శనం కల్పించామని, గరుడ సేవనాడు (Tirumala)భక్తులందరికీ అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా అందించడం జరిగిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.
అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) నిర్వహిస్తామని, ఇందుకోసం ఈ నెల 14వ తేదీన అంకురార్పణ జరుగనుందని టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 19వ తేదీన గరుడసేవ, అక్టోబరు 20వ తేదీన పుష్పకవిమానం, అక్టోబరు 22వ తేదీన స్వర్ణరథం, అక్టోబరు 23వ తేదీన చక్రస్నానం నిర్వహిస్తామని టీటీడీ (Tirumala) ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

ఉదయం వాహనసేవ 8 గంటల నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 గంటల నుండి 9 గంటల వరకు (Tirumala) జరుగుతుంది. గరుడవాహనసేవ (Brahmotsavam)రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. భక్తులందరికీ దర్శనం కల్పించేలా రాత్రి 12 గంటల వరకు గరుడవాహన సేవ ఉంటుందని, ఈ ఉత్సవాల్లో ధ్వజావరోహణం ఉండవని, బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబరు 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణ సేవలు రద్దయ్యాయని టీటీడీ ఈవో తెలిపారు.
ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం (Tirumala)సేవాటికెట్లు బుక్ చేసుకున్న గృహస్తులను వారికి సూచించిన వాహనసేవలకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేయడమైనదని, శ్రీవారి భక్తుల భద్రతా దృష్ట్యా అక్టోబరు 19వ తేదీన గరుడసేవ నాడు (Brahmotsavam) ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను పూర్తిగా రద్దు చేయడమైనదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.
బ్రహ్మోత్సవాల (Brahmotsavam)మరుసటిరోజైన అక్టోబరు 24వ తేదీన పార్వేట ఉత్సవం జరుగునుంది.కాటేజి దాతలకు గదుల (Tirumala)కేటాయింపు గురించి టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ అక్టోబరు 19వ తేదీన గరుడసేవ సందర్భంగా అక్టోబరు 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండవని. బ్రహ్మోత్సవాల మిగతా రోజుల్లో యధావిధిగా కాటేజీలు (Brahmotsavam) కేటాయించడం జరగుతుందని వివరించారు.

పెరటాసి శనివారాలు, వరుస సెలవుల కారణంగా ఆధిక రద్దీ దృష్ట్యా, ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని రద్దు చేశామని, తిరుపతిలో అక్టోబర్ 6, 7, 8, 13, 14, 15వ తేదీలలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు (Tirumala)జారీ చేయబడవని, భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్వదర్శనానికి వెళ్లవచ్చని, శ్రీవారి(Brahmotsavam)భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరుతున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వివరించారు.
-
రాములవారి సేవలో శ్రీవారి సేవకులు, అరుదైన ఘట్టం - కన్నుల పండువగా..!! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications