టీడీపీ ఎమ్మెల్యే తండ్రి కారులోని రూ.50లక్షలు ఎత్తుకెళ్లిన డ్రైవర్
కర్నూలు: కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి తండ్రి, టీటీడీ సభ్యుడు రామకృష్ణారెడ్డికి చెందిన రూ.50లక్షల నగదును కారు డ్రైవర్ ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ నుంచి రాజంపేటకు వెళుతున్న రామకృష్ణారెడ్డి కర్నూలులోని రాజ్‌విహార్ హోటళ్లో భోజనం కోసం ఆగారు. కారులో ఉన్న రూ.50 లక్షల నగదుకు డ్రైవర్‌ను కాపలాగా ఉంచి భోజనానికి వెళ్లారు.

అయితే, రామకృష్ణారెడ్డి భోజనం చేసి వచ్చేలోగా కారులో ఉన్న సొమ్ముతో డ్రైవర్ మల్లికార్జున పరారయ్యాడు. రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోటల్‌కు వచ్చిన డీఎస్పీ, సీఐలు సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించారు.












Click it and Unblock the Notifications