జర భద్రం బ్రదర్.. ఫుడ్ డెలివరీ కన్నా ప్రాణం మిన్న !!
స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌కు సంబంధించిన ఒక ప్రమాదకర ఘటన దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా ఉండాల్సిన ఒక ఫుడ్ డెలివరీ, క్షణాల్లో ప్రాణాంతక ప్రమాదంగా మారడం అందరినీ కలచివేసింది. దీంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఘటన..
ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఒక ప్రయాణికుడికి ఆహార పార్సల్ అందించేందుకు రైలు ఎక్కిన స్విగ్గీ డెలివరీ వర్కర్, రైలు నుంచి కదులుతున్న సమయంలో దిగేందుకు ప్రయత్నించగా తీవ్రంగా గాయపడే ప్రమాదం ఎదురైంది. అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఒక పౌరుడు ఈ వీడియోను రికార్డు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీడియోలో డెలివరీ ఏజెంట్ తీవ్ర ప్రమాదంలో ఉన్న తీరు స్పష్టంగా కనిపించడంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైలు కేవలం 1–2 నిమిషాలు మాత్రమే ఆగింది. ప్రయాణికుడు 1వ ఏసీ కోచ్‌లో ఉన్నారు కానీ ఆహారం అందించేలోపే రైలు కదలడం ప్రారంభమైంది. అంతే కాకుండా డెలివరీ భాగస్వామికి మరో ఆర్డర్ ఉండడం.. అతని బైక్, స్టేషన్ వెలుపల ఉండడంతో అతను తప్పనిసరిగా దిగాల్సి వచ్చింది అని వివరించారు.
ఈ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆ పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. ఇది ప్రమాదం కాదు — ఇది భద్రత, బాధ్యత లోపం. నాకు స్విగ్గీ నుంచి ఎలాంటి పరిహారం అవసరం లేదు. ఆ డెలివరీ భాగస్వామికి కంపెనీ సహాయం చేయాలి. రైలు నంబర్ 18464 (ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), ప్రదేశం అనంతపురం. ఏ డెలివరీ కూడా మానవ ప్రాణం కంటే విలువైనది కాదని వెల్లడించారు.
గిగ్ వర్కర్లపై గడువు ఒత్తిడి..
ఈ పోస్ట్ కింద కామెంట్లలో అనేక మంది గిగ్ వర్కర్లు తమ అనుభవాలను పంచుకున్నారు.
-
“10 నిమిషాల డెలివరీ పేరుతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఆపాలి.”
-
“రైలు డెలివరీలను పూర్తిగా నిషేధించాలి.”
-
“కస్టమర్లు తమ ఆహారాన్ని ప్లాట్‌ఫామ్ వద్దే తీసుకునేలా స్పష్టమైన నిబంధనలు ఉండాలి.”
-
“కదులుతున్న లేదా రద్దీగా ఉన్న రైళ్లలో సీట్ల వరకు వెళ్లమని డెలివరీ వర్కర్లపై ఒత్తిడి చేయకూడదు.”
అంటూ పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
స్విగ్గీ అధికారిక స్పందన..
మరోవైపు ఈ ఘటనపై స్విగ్గీ సంస్థ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.“మేము ఈ ఘటనను పూర్తిగా పరిశీలించాము. డెలివరీ భాగస్వామి సురక్షితంగా ఉన్నారు, ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. అధికారుల నుండి ఎలాంటి జరిమానా కూడా ఎదురుకాలేదు. భద్రత మా అత్యున్నత ప్రాధాన్యత” అని స్విగ్గీ తెలిపింది.
నిబంధనలు, భద్రతా శిక్షణపై వివరణ
స్విగ్గీ మరింతగా స్పందిస్తూ,“కదులుతున్న రైళ్లలో ఎక్కడం లేదా దిగడం మా నిబంధనల ప్రకారం కఠినంగా నిషేధించబడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, డెలివరీ భాగస్వాములకు భద్రతా శిక్షణను మరింత బలోపేతం చేశాము. నిబంధనలను పాటిస్తూ, ప్రమాదాల నుంచి దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం” అని పేర్కొంది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications