ఎన్నికల్లో ఏ చిన్న తేడా జరిగినా, ఇక - సజ్జల కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్దమవుతున్నాయి. అన్ని వర్గాల మద్దతు కూగడట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఇంఛార్జ్ ల మార్పు కసరత్తు తుది దశకు చేరుకుంది. వైసీపీలో అభ్యర్దులపైన స్పష్టత వచ్చిన తరువాత టీడీపీ, జనసేన తొలి జాబితా విడుదలకు సిద్దమవుతున్నాయి, బీజేపీ తమతో కలిసి వస్తుందా లేదా అనేది ఈ నెలాఖరులోగా స్పస్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయం లో వచ్చే ఎన్నికల్లో ఫలితాలపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు.
భాగస్వాములు కావాలి : పథకాలు, సంస్కరణల్లో సీఎం వైయస్ జగన్ బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వైఎస్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైసీపీగా పేర్కొన్న సజ్జల.. అణగారిన వర్గాలతో అసోసియేట్ అవ్వడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అణగారిన వర్గాలనుపైకి తీసుకువచ్చే ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల భాగస్వామ్యం కావాలని కోరారు. సచివాలయ ఉద్యోగాల్లో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే దక్కాయన్నారు. మేనిఫెస్టోలో లేనివి కూడా జగన్ అమలు చేశారని సజ్జల పేర్కొన్నారు.

ఏ చిన్న తేడా జరిగినా : గత ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కోసం ఖర్చు చేసిందేమీ లేదన్నారు. సంపన్నులతో పోటీ పడే స్థాయికి అన్ని వర్గాలనూ తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవని చెప్పారు. సీఎం జగన్ అర్హులైన వారిని వెతికి మరీ ఇచ్చారని వివరించారు. ఈ నాలుగున్నరేళ్లలో జరిగినంత సంక్షేమం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరగలేదన్నారు. ఎన్నికలు రాబోతున్నాయని చెప్పిన సజ్జల..అందరి భవిష్యత్తులు మారాలంటే ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఏ చిన్న తేడా జరిగినా పేదలకు జరుగుతున్న మంచి దూరమైపోతుందంటూ సజ్జల అప్రమత్తం చేసారు.
అదే సీఎం ఆలోచన : మీడియాను మేనేజ్ చేస్తే సరిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయన్నాయన్నారు. ఏమీ జరగడం లేదని ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తున్న మంచికి.. అభివృద్ధికి పబ్లిసిటీ అవసరం లేదని సీఎం భావించారని సజ్జల తెలిపారు. కొత్తగా రూపుదిద్దుకుంటున్న పోర్టులు రాష్ట్రం రూపురేఖలు మార్చేస్తాయన్నారు. 11 మెడికల్ కళాశాలల ద్వారా దేశానికి కావాల్సిన వైద్యులను ఏపీ అందించబోతోందని వివరించారు. అంబేద్కర్ విగ్రహం గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుంటుందన్నారు. విజయవాడలో కొండ పై అమ్మవారు...కొండ కింద అంబేద్కర్ కనిపిస్తారని సజ్జల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications