వైసీపీని తొక్కేయాలని చూసారు, సమయం వచ్చింది - సజ్జల..!!
వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వై ఏపీ నీడ్స్ కార్యక్రమం పార్టీలకు అతీతంగా జరుగుతుందని చెప్పారు. టీడీపీ వాళ్ళు కూడా పాల్గొనచ్చని స్పష్టం చేసారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంకెలతో సహా చెప్పడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని వెల్లడించారు. కోటి 40 లక్షల కుటుంబాలకు పైగా ఈ ప్రభుత్వం లో లబ్ది జరిగిందని చెప్పిన సజ్జల...రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ వై నీడ్స్ సీఎం జగన్ ప్రారంభం అవుతుందని చెప్పారు.
ప్రజల్లోకి వెళ్లే సమయం ఇది : టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల గురించి సజ్జల స్పందించారు. టీడీపీ నేతలు సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు జైలులో ఉంటే టీడీపీ లో కార్యక్రమాలు చేయటానికే నేతలే లేరా అన్ని ప్రశ్నించారు. నాడు జగన్ పైన తప్పుడు కేసులు నమోదు చేసారని గుర్తు చేసారు. ఆ సమయంలో వైసీపీ తొక్కేయాలని చూసారని చెప్పుకొచ్చారు. అన్ని ఎదుర్కొని పార్టీ నిలబడిందని సజ్జల వివరించారు. ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్లే సమయం వచ్చిందని..జగన్ పానలలో జరిగిన సంక్షేమం గురించి ప్రతీ ఇంటికి వివరిస్తామని సజ్జల చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తే అందులో ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షలు ఉన్నాయని వెల్లడించారు.

వై ఏపీ నీడ్స్ జగన్ : సీఎం జగన్ సంక్షేమమే.అభివృద్ధి నినాదంగా తన పాలనలో స్పష్టం చేసారని సజ్జల చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వంలో కోటి కుటుంబాలకు పైగా లబ్ది జరిగిందని వివరించారు. అధికారంలోకి వచ్చిన తరువాత తొలి రెండేళ్లు కోవిడ్ ఉన్నా ఎక్కడా సంక్షేమం ఆగలేదని వెల్లడించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ వై నీడ్స్ జగన్ కార్యక్రమం ద్వారా చంద్రబాబు ఎందుకు వద్దు జగన్ ఎందుకు కావాలి అనేది కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు. వచ్చే నెల 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మొదటి రోజు వైసీపీ జెండా ఆవిష్కరణ ఉంటుందన్నారు. గ్రామాల్లో గ్రామ పెద్దలతో సభలు సమావేశాలు ఉంటాయని... గ్రామ పెద్దల సలహాల తో గ్రామాల్ని బలోపేతం చెయ్యడం పైన నిర్ణయాలు ఉంటాయని వివరించారు.
కోటి 40 లక్షల కుటుంబాలకు లబ్ది : ఈ కార్యక్రమ నిర్వహణ సమయంలో ప్రతి గడప కు గృహ సారథులు...కన్వీనర్లు...వాలంటీర్లు వీరితో పాటు ఎమ్మెల్యే లు మండల నేతలు హాజరు అవుతారని చెప్పుకొచ్చారు. జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్షలతోనే మా పార్టీ మ్యానిఫెస్టో రూపొందిందని గుర్తు చేసారు. నాలుగున్నర ఏళ్ళల్లో కోటి 40 లక్షల కుటుంబాలకు నేరుగా ప్రయోజనం పొందారని వివరించారు. ప్రజలకు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఒక భద్రతను, నమ్మకాన్ని జగన్ కల్పించారని పేర్కొన్నారు. వై ఏపి నీడ్స్ జగన్ కార్యక్రమంలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమం గురించి ఆధారాలతో సహా పాలనకు సంబంధించి అన్ని వివరిస్తామన్నారు. ఎమ్మెల్యే లు ఇప్పటికే జనంలో ఉన్నారని..జగనన్న సురక్షా కార్యక్రమం విజయవంతం గా జరుగుతోందని సజ్జల వివరించారు.












Click it and Unblock the Notifications