సత్తెనపల్లి కుంపటి : టిడిపి..వైసిపి ల్లో భగ్గుమన్న అసంతృప్తి: రోడ్డెక్కిన నిరసనలు..!
గుంటూరు జిల్లా సత్తెనపల్లి టిక్కెట్ల కేటాయింపు టిడిపి..వైసిపి ల్లో చిచ్చు రాజేసింది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు టిడిపి సీటు ఇవ్వటంతో అక్కడ ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. వైసిపి లో సీనియర్ నేత అంబటి రాంబాబు కు సీటు ఇవ్వటాన్ని పార్టీలోని కొందరు వ్యతిరేకిస్తూ..లోటస్ పాండ్ కు చేరుకున్నారు.

కోడెల కు వ్యతిరేకంగా రోడ్ల పైకి..
సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోడెల శివప్రసాద్ కు టిడిపి తిరిగి సీటు కేటాయించింది. తొలి నుండి ఆయనకు నర్సరావు పేట ఎంపీగా పోటీ చేయమని టిడిపి అధినాయకత్వం కోరినా..కోడెల అంగీకరించలేదు. పట్టుబట్టి మరీ కోడెల సత్తెనపల్లి సీటు సాధించారు. అయితే, సత్తెనపల్లి సీటు కోడెలకు వద్దంటూ స్థానిక టిడిపి నేతలు ఆందోళన బాట పట్టారు. అసమ్మతి నేతలు సత్తెనపల్లిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కోడెల వద్దు..చంద్రబావద్దు, కోడెల పోవాలి అనే నినాదా లతో అసమ్మతి నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే, దీని పై కోడెల స్పందించారు. ఎన్నికల సమయంలో చిన్నచిన్న సమస్యలు సహజమని..తానే సత్తెనపల్లి అభ్యర్దిగా పోటీ చేస్తున్నానని కోడెల ప్రకటించారు. ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.
లోటస్ పాండ్ లో పంచాయితీ..
ఇదే నియోజకవర్గం నుండి వైసిపి అభ్యర్ధి అంబటి రాంబాబు దాదాపు ఖరారయ్యారు. అంబటికి సీటు ఇవ్వదంటూ పార్టీకి చెందిన బత్తుల బ్రహ్మానందరెడ్డి స్థానిక నేతలు మరి కొందరు ఆందోళన చేస్తున్నారు. వీరు అంబటికి వ్యతిరేకం గా తమ వాదనను నర్సరావుపేట పార్లమెంటరీ సమన్వయ కర్త లావు కృష్ణ దేవరాయుల వద్దకు తీసుకెళ్లారు. ఆయన ఈ పంచాయితీని కృష్ణ దేవరాయులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు వెంటనే అసంతృప్తులను వెంట బెట్టుకొని లోటస్‌పాండ్ కు చేరుకున్నారు. వారు అక్కడ కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. అంబటి పోవాలి .. జగన్ రావాలని అంటూ అక్కడ నినాదాలు చేస్తున్నారు. వారికి జగన్ ఏ రకంగా సద్దిచెబుతారు..ఎటువంటి హామీ ఇస్తారనే దాని పై అసక్తి నెలకొంది. అయితే, వైసిపి నుండి అంబటి సత్తెనపల్లి నుండి పోటీ చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ఈ సత్తెనపల్లి వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications