నిలిచిన మున్సిపల్ పోల్స్ ఇక అప్పుడే - అర్ద్రరాత్రి కీలక పరిణామాలు..!!

మున్సిపల్ ఎన్నికల వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నేతలు తమ ను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారంటూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. కోర్టు ఈ మేరకు ఎస్ఈసీకి కీలక ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ ఫిర్యాదులను పరిశీలించి నామినేషన్ల పైన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో.. వైసీపీ ఫిర్యాదు చేసిన 19 మున్సిపాల్టీల పరిణామాల పైన నివేదిక తెప్పించుకుంటోంది. ఈ సమంలోనే ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రకటన చేసింది. కాగా.. తిరిగి ఎన్నికల నిర్వహణ పైనా స్పష్టత వస్తోంది.

రాష్ట్రంలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వైసీపీ సుప్రీం కోర్టులో పిటీషన్.. సుప్రీం మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వైసీపీ ఫిర్యాదు చేసిన 19 మున్సిపాల్టీల పై జిల్లా కలెక్టర్ల నుంచి ఎన్నికల సంఘం నివేదిక కోరింది. ఈ నివేదిక ఆధారంగా ఈ రోజు తిరిగి నామినేషన్ల పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా.. తొలుత 19 మున్సిపాల్టీల్లో ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశం పైన న్యాయ నిపుణుల సలహాలు కోరింది. అయితే, 25వ తేదీ వరకు పోటీలో ఉన్న అభ్యర్ధుల జాబితా ప్రకటించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో.. పూర్తిగా ఎన్నికల ప్రక్రియ ను తాత్కాలికంగా నిలిపివేస్తే ఎన్నికల సంఘం అర్ద్రరాత్రి ప్రకటన చేసింది.

PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం మార్పు, తాజా అప్డేట్..!!
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం మార్పు, తాజా అప్డేట్..!!
sec-begins-exercise-to-resume-municipal-elections-after-supreme-court-order-here-the-latest-report

ఎన్నికల సంఘం కసరత్తు

అయితే, ఈ రోజు 19 మున్సిపాల్టీల పైనా ఎన్నికల సంఘానికి నివేదికలు అందనున్నాయి. వీటి ఆధారంగా తిరిగి నామినేషన్లకు ఎక్కడ అవకాశం ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, నామినేషన్ల దాఖలుకు 48 గంటల సమయం ఇవ్వనున్నారు. ఈ నెల 25న పోటీ అభ్యర్ధుల తుది జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ముందుగా ఈ నెల 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరిగే లా షెడ్యూల్ ప్రకటించారు. ఇప్పుడు తేదీలు మారనున్నాయి. నవంబర్ 3న జెడ్పీటీసీ పోలింగ్, 5 న ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో.. ఈ తేదీల్లో మార్పు లేకుండా.. ఆ ప్రక్రియకు ఇబ్బంది లేకుండా మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. లేకుంటే, జెడ్పీటీసీ కౌటింగ్ తరువాత నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు వీటి నిర్వహణ పైన స్పష్టత రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+