PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం మార్పు, తాజా అప్డేట్..!!
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల కోసం రైతులు వేచి చూస్తున్నారు. దసరా వేళ ఈ నిధులు జమ అవుతాయని భావిస్తున్నారు. ఈ నిధుల విడుదల పైన ప్రస్తుతం కసరత్తు జరుగు తోంది. వరుస పండుగలు.. ఎల్ నినో కష్టాల వేళ రైతుల ఖాతాల్లో నిధుల జమ దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిధుల జమ పైన నిర్ణయానికి వచ్చారు. కేంద్రం విడుదల చేస్తున్న పీఎం కిసాన్ నిధులతో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మలి విడత నిధుల పైనా రైతులకు కీలక అప్డేట్ అందుతోంది.
రైతులు వేచి చూస్తున్న పీఎం కిసాన్ నిధుల పైన కసరత్తు కొనసాగుతోంది. 24వ విడత నిధుల జమకు సిద్దం అవుతోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6,000 ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతలలో పంపిణీ చేస్తున్నారు. ప్రతి విడత రూ.2,000 చొప్పున నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ఈ పథకం కింద విడతలు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదలవుతాయి. చివరి విడత అయిన 23వ విడత జూన్లో విడుదలైంది. దీంతో.. 24వ విడత నిధుల జమ పైన చర్చ సాగుతోంది. ఈ నెలలోనే తొలుత విడదల చేయాలని భావించారు. అయితే, కేంద్రంలో ఈ మేరకు తాజాగా జరిగిన చర్చల్లో దసరా ముందు.. ఈ నెల 17 లేదా 18వ తేదీన ఈ నిధులు విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే, వచ్చే వారం ఈ నిధులు విడుదల చేస్తారని తాజా సమాచారం అందుతోంది.

కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల కసరత్తు
ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ పథకంలో నిధులు పొందే రైతులు తమ కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు ఇంకా తమ ఇ-కేవైసీని పూర్తి చేయకపోతే, వారి తదుపరి వాయిదా జమ నిలుపుదల చేసే అవకాశం ఉంది. పీఎం కిసాన్ వాయిదా స్థితిని తెలుసుకోవాలనుకుంటే రైతులు ఆన్లైన్లో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. అదే విధంగా పీఎం కిసాన్ నిధుల జమ సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను జమ చేయనుంది. గత ఏడాదిన్నార కాలంగా కేంద్ర నిధులతో పాటుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. కేంద్రం ఇచ్చే రూ 6 వేలతో పాటుగా ఏపీ ప్రభుత్వం రూ 14 వేలు అందిస్తోంది. దీని ద్వారా ఏపీలోని రైతులకు వచ్చే నెల అటు కేంద్రం.. ఇటు ఏపీ ప్రభుత్వం అందించే రూ 6 వేలు ఒకే విడత రైతుల ఖాతాల్లో జమ కానుంది.












Click it and Unblock the Notifications
