5 బస్సుల్లో వెలగపూడికి.. సీఎం లేకుండానే: హైద్రాబాద్ ఫర్నీచర్ వద్దు!
విజయవాడ: నవ్యాంధ్రలో పాలన ఇకపై కొత్త రాజధాని నుంచి సాగనుంది. అమరావతి పరిధిలోని వెలగపూడిలో కొత్తగా నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయం ఈ రోజు (బుధవారం) లాంఛనంగా ప్రారంభం కానుంది. మధ్యాహ్నం జరగనున్న ఈ ప్రారంభోత్సవంలో భాగంగా ఐదో బ్లాక్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌ను సిద్ధం చేశారు.
ఈ ఫ్లోర్‌లో తొలుత నాలుగు శాఖలకు చెందిన సెక్రటేరియట్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రారంభోత్సవానికి హైదరాబాదు నుంచి 200 మంది ఉద్యోగులు ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తరలి వెళ్తున్నారు.
హైద్రాబాద్ టు అమరావతి.. అరగంటకో బస్సు: హైదరాబాద్ వెలవెల!ఇప్పటికే విజయవాడ, గుంటూరు పరిసరాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న వివిధ శాఖల ఉద్యోగులు కూడా హాజరవుతున్నారు. వీరి కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా 11 బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి ఐదు బస్సుల్లో 200 మంది ఉద్యోగులు బయలుదేరారు.
తాత్కాలిక సచివాలయంలోకి నాలుగు శాఖలు ప్రవేశిస్తాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని తన చాంబర్లోకి ప్రవేశిస్తారు. పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా కార్యాలయంలోకి ప్రవేశిస్తారు. మిగతా రెండు శాఖల మంత్రులు వివిధ కారణాల వల్ల బుధవారం రావడం లేదని తెలుస్తోంది.

చంద్రబాబు గైర్హాజరీలో...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. ఆయన గైర్హాజరీలోనే తాత్కాలిక సచివాలయం లాంచనంగా ప్రారంభం కానుంది.
హైదరాబాద్ నుంచి ఫర్నీచర్ అవసరం లేదు
హైదరాబాద్ నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి ఫర్నీచర్ తీసుకు రావాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో కొత్త ఫర్నీచర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం చెప్పారు.
సచివాలయానికి ఫర్నీచర్, ఎయిర్ కండీషన్స్ అవసరమైతే గుంటూరు, విజయవాడలకు తరలి వెళ్లి శాఖాధిపతుల కార్యాలయాలకు ఇవ్వాలని టక్కర్ సూచించారు. సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఉమ్మడి ఫైళ్లను తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయంతో స్కానింగ్ చేయాలని సీఎస్ సూచించారు.
రాష్ట్ర విభజన సమయంలో ఫైళ్ల స్కానింగ్ ఏ ధరకైతే చేయించారో, అదే ధరకు స్కానింగ్ చేయించాలని, ఇందుకు ఐటీ శాఖతో సంప్రదింపులు జరపాలన్నారు. కాగా, వెలగపూడి సచివాలయానికి హైదరాబాద్ నుంచి నాలుగు శాఖలు తరలి వెళ్తున్నాయి.












Click it and Unblock the Notifications