హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద్రాబాద్ టు అమరావతి.. అరగంటకో బస్సు: హైదరాబాద్ వెలవెల!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిసరాల్లోని విజయవాడకు ఉద్యోగులు తరలి వెళ్తున్నారు. దీంతో, ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లను చేసిందిత. వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల నుంచి సుమారు 26వేల మంది ఉద్యోగులు తరలి వెళ్తున్నారని తెలుస్తోంది.

సుమారు ఆరువేల మంది ఉద్యోగులు వారం చివర్లో విజయవాడ - హైదరాబాద్ ప్రయామిస్తున్నారు. ఈ రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపే ఏర్పాట్ల పైన దృష్టి సారించాయి.

హైదరాబాద్‌కు గుడ్‌బై, సైకిల్ పైన అమరావతి బయలుదేరిన మహిళా ఉద్యోగిహైదరాబాదులోని ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్‌తో పాటు వివిధ ప్రధాన ప్రాంతాల నుంచి విజయవాడ వరకు, గుంటూరు, విజయవాడల మీదుగా ఇతర ప్రాంతాలకు ఏపీఎస్ ఆర్టీసీ 250, తెలంగాణ ఆర్టీసీ 50 బస్సులు నడుపుతున్నాయి. ప్రస్తుతం ప్రతి అరగంటకు ఓ బస్సు చొప్పున బెజవాడ వైపు వెళ్తోంది.

రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు నడిపేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అమరావతి స్పెషల్, సూపర్ లగ్జరీ బస్సులను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే, హైదరాబాద్ నుంచి దాదాపు నాలుగు వందలకు పైగా ప్రయివేటు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.

Shifting of Andhra Pradesh government employees to new capital gains momentum

రాజధాని తరలింపు దృష్ట్యా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు విజయవాడ - హైదరాబాద్ మధ్య ఏపీ ఉద్యోగుల కోసం ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించారు. వారానికి ఆరు రోజులు రాకపోకలు సాగిస్తుంది. ఇది గుంటూరు, విజయవాడల్లో మాత్రమే ఆగుతుంది. రద్దీ పెరిగితే మరిన్ని బోగీలు ఏర్పాటు చేస్తారు.

వెలవెలబోతునన హైదరాబాద్ కార్యాలయాలు!

ఏపీ పాలన నవ్యాంధ్ర నూతన రాజధానికి దాదాపుగా తరలిపోయింది. మెజార్టీ ప్రభుత్వ శాఖలు అమరావతి పరిసరాలైన గుంటూరు, విజయవాడలకు తరలివెళ్లాయి. ఈ నేపథ్యంలో సోమవారం అమరావతిలో సందడి వాతావరణం నెలకొంది. ఒక్కరోజే ఏకంగా 14 కార్యాలయాలు ఏర్పాటు కావడంతో అక్కడ ప్రారంభోత్సవాల సందడి కనిపించింది.

కళ్లు చెమర్చాయి: ఏపీ-టీ ఉద్యోగులు విడిపోతూ... (పిక్చర్స్)కళ్లు చెమర్చాయి: ఏపీ-టీ ఉద్యోగులు విడిపోతూ... (పిక్చర్స్)

అదే సమయంలో హైదరాబాదులోని ఆయా శాఖల ప్రధాన కార్యాలయాలు (హెచ్ఓడీలు) మాత్రం వెలవెలబోయాయి. అమరావతిలో కార్యాలయాల ప్రారంభోత్సవం నేపథ్యంలో మరికొంత కాలం పాటు హైదరాబాదులోనే ఉండాల్సిన ఉద్యోగులు కూడా అమరావతికి తరలివెళ్లారు. దీంతో హైదరాబాదులోని కార్యాలయాలన్నీ ఉద్యోగులు లేక వెలవెలబోయాయి.

English summary
As Andhra Pradesh builds its new capital city Amaravati, the process of shifting of government employees from the common capital of Hyderabad is going on at a brisk pace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X