బిగ్ షాక్: పెరిగిన పాల ధరలు.. రేపటి నుంచే అమల్లోకి

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి భిన్నంగా ఉంది. అయితే తాజాగా సామాన్యులపై మరో భారం పడనుంది. అమూల్ పాల ధరలను గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ పెంచింది. ఈ మేరకు లీటర్ కు రూ. 2 చొప్పున ధర పెంచుతున్నట్లు అముల్ సంస్థ ప్రకటించింది. పెరిగిన ధరలు రేపటినుంచి అంటే మే 14 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని పేర్కొంది.

గేదెలకు గడ్డి అలాగే ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అముల్ ప్రకటించింది. మే 2025 తర్వాత అముల్ పాల ధరలను పెంచడం ఇదే తొలిసారి. ఇక పాల రకం, ధరల వివరాలు చూస్తే అముల్ తాజా పాత అర లీటర్ ధర రూ. 29 ఉండగా కొత్త ధర రూ. 30 కు చేరింది. అముల్ గోల్డ్ పాల ధర అర లీటర్ రూ. 35 ఉండగా కొత్త ధర రూ. 36 కు చేరింది. అలాగే ఆవుపాలు అర లీటర్ ధర రూ. 30 ఉండగా కొత్త ధర రూ. 31 కు చేరింది. ఇక అముల్ స్లిమ్ అండ్ ట్రిమ్ ధర రూ. 26 ఉండగా కొత్త ధర రూ. 27 కు చేరింది.

Amul Milk Prices Hiked by Rs 2 Per Litre New Rates to Come into Effect Nationwide from May 14

ఇక అముల్ తో పాటుగా మదర్ డెయిరీ సంస్థ కూడా తమ పాల ధరలను లీటర్ కు రూ. 2 పెంచుతున్నట్లు ప్రకటించింది. అది కూడా మే 14 నుంచే అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. తాజాగా పాల సంస్థలు ధరలు పెంచడంతో సామాన్యుల నెలవారీ బడ్జెట్ పై కొంత భారం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+