'స్పైడర్ మ్యాన్' మూవీకి కలెక్షన్ల సునామీ.. 4 రోజుల్లోనే ఏకంగా అన్ని వేల కోట్లా..!

యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే సూపర్ హీరోల్లో స్పైడర్ మ్యాన్ ఒకరు. ఈ క్యారెక్టర్ మీద వచ్చిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేశాయి. హాలీవుడ్.. టాలీవుడ్ అని తేడా లేకుండా ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 30 న విడుదలైన ఈ మూవీ కేవలం 4 రోజుల్లోనే ఏకంగా రూ. 7,694 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ విదేశాల్లోనే కాదు భారత్ లోనూ సంచలన విజయం దిశగా దూసుకెళ్తోంది.

అటు భారత్ వ్యాప్తంగా మొదటిరోజే ఏకంగా రూ. 61 కోట్ల రూపాయిల నెట్ వసూల్లు చేసింది. రెండో రోజు రూ. 38 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అదే విధంగా మూడో రోజు ఏకంగా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక నాలుగో రోజు మరో 77 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా చూస్తే అన్ని భాషలు కలిపి ఈ చిత్రానికి ఫస్ట్ వీకెండ్ లో దాదాపు రూ. 300 కోట్ల వరకు వసూల్లు రాబట్టినట్లు స్పష్టం అవుతోందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ నుంచి ఏకంగా రూ. 23 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి. అలాగే ఏపీ నుంచి రూ. 12 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ.

అలాగే ప్రపంచవ్యాప్తంగా చూస్తే నార్త్ అమెరికాలో ఈ మూవీకి ఏకంగా 350 కు పైగా మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు స్పష్టం అవుతోంది. అలాగే వరల్డ్ వైడ్ గా 920 కు పైగా మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలా ఫస్ట్ వీకెండ్ లో ఈ చిత్రానికి ఏకంగా 7,694 కోట్ల రూపాయిల గ్రాస్ రాబట్టినట్లు స్పష్టం అవుతోంది. మరి ఫుల్ రన్ లో ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.

SpiderMan creates tsunami at the box office A gross of 7 694 crore in just 4 days world wide gross

ఇక స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో హాలీవుడ్ స్టార్స్ టామ్ హాలాండ్, జెండాయా, సౌదీ సింక్, జాన్ బెర్నథాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ మూవీకి డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వం వహించారు. 2021లో వచ్చిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమాకు కొనసాగింపుగా స్పైడ‌ర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ తెరకెక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+