"రాష్ట్రంలో మెగా గ్రోత్ కారిడార్‌.. ఆ మూడు నగరాలకు ఓఆర్‌ఆర్‌లు"

మెగా గ్రోత్ కారిడార్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. పట్టణాల మధ్య అనుసంధానతను పెంచేందుకు మూడు ప్రధాన కారిడార్లను అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని రోడ్లు నిర్మించాలన్నారు. ఈ మేరకు ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఓఆర్‌ఆర్‌లు వేయాలన్నారు. అలాగే మహబూబ్ నగర్- భూత్పూర్- జడ్చర్ల కారిడార్, కొత్తగూడెం- పాల్వంచ- సుజాతా నగర్ కారిడార్ ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వ అవసరాల కోసం ఇకపై కొత్తగా వాహనాలను కొనుగోలు చేయకుండా కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అద్దెకు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

అలాగే ప్రతి పురపాలక సంఘంలోనూ సోలార్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇక ఘన వ్యర్థాల నిర్వహణ, మరుగునీటి శుద్ధి ప్లాంట్లు, ప్రతి మున్సిపాలిటీలో అంతర్భాగం కావాలని తెలిపారు. పట్టణాల కేంద్రంగా అభివృద్ధి ప్రణాళిక ఉండాలని సూచించారు. డిఫెన్స్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇక సింగరేణి పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను ఒకే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ గా మార్చాలని, సింగరేణి సీఎస్ఆర్ నిధులను స్థానిక అభివృద్ధికి మాత్రమే వాడాలని స్పష్టం చేశారు.

RevanthReddy Orders Outer Ring Roads for Khammam Warangal amp amp Karimnagar During Mega Growth Review

యాదగిరి గుట్ట- నల్గొండ ప్రాంతాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ అభివృద్ధి, ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్ట్ లు కలుపుతూ పర్యాటక అభివృద్ధి అలాగే త్వరలో రానున్న కృష్ణా పుష్కరాల దృష్ట్యా అలంపురం జోగులాంబ ఆలయ పరిసరాలను ఆధునీకరించాలని ఆదేశించారు. అలాగే నగరాల్లో రేడియేషన్ తగ్గించేందుకు మల్టీ యూటిలిటీ టవర్లు, స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ మేనేజ్ మెంట్ కోసం ఏఐను వినియోగించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+