AP SIR: ఉద్యోగుల బదిలీలపై సర్కార్ కీలక నిర్ణయం-జీవో జారీ..!
ఏపీలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (AP SIR) కొనసాగుతోంది. ఇప్పటికే బీఎల్వోలు ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్లకు ఇవ్వడం, వాటిని భర్తీ చేశాక తిరిగి తీసుకోవడం, వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా గత ఎస్ఐఆర్ తో వివరాలు సరి చూసుకుని ముసాయిదా ఓటర్ల జాబితాలు తయారు చేసి విడుదల చేయడం జరిగిపోయాయి. ఇప్పుడు ముసాయిదా ఓటర్ల జాబితాలో లేని ఓటర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, వాటిని పరిశీలించి తుది ఓటర్ల జాబితా తయారు చేయడం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో పాలుపంచుకుంటున్న ఉద్యోగులపై ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములైన ఉద్యోగులను ఇది ముగిసేవరకూ ఎలాంటి బదిలీలు చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఆదేశాలు ఇచ్చింది. వాటి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఉద్యోగుల బదిలీలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పొడిగించింది. తాజా గడువు ప్రకారం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాలు ప్రచురించాల్సి ఉంది. ఇది జరిగే వరకూ ఉద్యోగుల్ని బదిలీ చేయకూడదు. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది.

అక్టోబర్ 3వ తేదీ వరకూ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాలుపంచుకుంటున్న ఉద్యోగులను బదిలీ చేయకుండా నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు అక్టోబర్ 3 వరకూ అమల్లో ఉంటాయని, ఆ తర్వాతే ఆయా ఉద్యోగుల బదిలీలు ఉంటాయని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. దీంతో ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉన్న ఉద్యోగులంతా తమ బదిలీల కోసం అక్టోబర్ 3 వరకూ వేచి ఉండాల్సిందే.




Click it and Unblock the Notifications