Rahul Gandhi Skit: మోడీపై రాహుల్ 'మై ఫ్రాండ్ ' స్కిట్ వైరల్..! చీప్, వల్గర్ అంటూ బీజేపీ ఫైర్..!
నీట్ అక్రమాలపై ఢిల్లీలో విద్యార్ధుల నిరసనల తర్వాత జెన్ జీని ఆకట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 'ఛాత్రోంకీ గూంజ్' పేరుతో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటిలో ప్రధాని మోడీని విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నిర్వహించిన 'ఛాత్రోంకీ గూంజ్' కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఓ కమెడియన్ ను తీసుకొచ్చి ప్రధాని మోడీ విదేశీ నేతలను కలిసినప్పుడు ప్రదర్శించే హావభావాలతో స్కిట్ చేయించారు. ఇది కాస్తా వివాదాస్పదమైంది.
ఇండోర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీని (Rahul Gandhi) చూసేందుకు, మాట్లాడేందుకు భారీ ఎత్తున విద్యార్ధులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో స్టాండ్-అప్ కమెడియన్ పుల్కిత్ మణి (Pulkit Mani) .. రాహుల్ గాంధీతో కలిసి వేదికపైకి వచ్చి, ప్రధాని మోదీ (PM Modi) ప్రసంగాన్ని, హావభావాలను, బహిరంగ వ్యక్తిత్వాన్ని అనుకరించారు. బీజేపీ ర్యాలీకి హాజరైన ఒక వృద్ధురాలి కోసం కుర్చీ ఏర్పాటు చేయమని ప్రధాని నిర్వాహకులను కోరిన సంఘటన నుండి ఈ స్కిట్‌లోని కొంత భాగం ప్రేరణ పొందినట్లు జనం ఆ తర్వాత గుర్తించారు.

My friend!! Great Harassment!! 🤣 pic.twitter.com/PqetUPxUWp
— Congress (@INCIndia) September 19, 2026
ఇండోర్ ఈవెంట్ లో స్టాండ్-అప్ కమెడియన్ మణి.. విదేశీ నాయకులతో ప్రధాని మోదీ మాట్లాడే సుపరిచితమైన సంభాషణా శైలిని అతిశయోక్తిగా ప్రదర్శిస్తూ, పదేపదే "మై ఫ్రెండ్" అనే పదాన్ని వాడారు. ఈ సందర్బంగా మణి.. రాహుల్ గాంధీని, "మీరు ఎలా ఉన్నారు, మై ఫ్రెండ్?" అని అడిగారు. గాంధీ, "మీరు ఎలా ఉన్నారు, మోదీ జీ?" అని బదులిచ్చారు. అప్పుడు మణి, "గ్రేట్ హెరాస్మెంట్ (ఘోరమైన వేధింపు)," అని సమాధానమిచ్చి, అతిశయోక్తిగా నవ్వడం ప్రారంభించారు. ఇదంతా బీజేపీకి మంటపుట్టించింది. ఈ స్కిట్‌ను చౌకబారు, అసభ్యకరమైన ట్రోల్స్ చేసిన బూతు చేష్టలుగా బీజేపీ అధికార ప్రతినిధి సి.ఆర్. కేశవన్ అభివర్ణించారు. ఏ మంచి, సరిగ్గా ఆలోచించే వ్యక్తి కూడా దాన్ని వినోదంగా భావించరని తెలిపారు.














Click it and Unblock the Notifications
