మోడీ స్వరాష్ట్రంలో బీజేపీ కోటలకు బీటలు..! అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ జోరు..!

ప్రధాని మోడీ (PM Modi) ఒకప్పుడు వరుసగా ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించి, అనంతరం ప్రధాని అయ్యాక కూడా అక్కడ పట్టు కొనసాగిస్తున్న స్వరాష్ట్రం గుజరాత్ (Gujarat). ఇక్కడ మోడీ హయాంలో వేసిన బీజాలు ఫలించి ఇప్పటికీ బీజేపీకి ఫలాలు అందిస్తూనే ఉన్నాయి. ఎన్నికలు జరిగితే చాలు బీజేపీదే (BJP) హవా అనే పరిస్ధితి గుజరాత్ లో మూడు దశాబ్దాలుగా నెలకొంది. అయితే ఇప్పుడు బీజేపీ అలా ఏర్పాటు చేసుకున్న కంచుకోటలకు బీటలు వారుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. అదీ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాషాయ దళానికి స్థానిక ఎన్నికల ఫలితాలు షాకులిస్తున్నాయి.

గుజరాత్‌లోని గ్రామీణ రాజకీయాల్లో అత్యంత బలమైనవిగా భావించే సహకార సంఘాల ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చాయి. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల తరహాలోనే వీటిని ప్రతిష్టాత్మకంగా భావించి పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతాయి. అలాంటి సహకార రంగ పోరులో, కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెండు ప్రతిష్టాత్మక స్థానాలను బీజేపీ మద్దతున్న ప్యానెళ్లు కోల్పోవడం సంచలనం రేపుతోంది. ముఖ్యంగా సంప్రదాయబద్ధంగా బీజేపీకి పట్టున్న ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ మద్దతు ఉన్న ప్యానెళ్లు ఊహించని రీతిలో ఘన విజయం సాధించాయి.

BJP Faces Setback in Gujarat Cooperatives as Kisan Parivartan Panel Sweeps Bardoli Sugar Poll

తొలి దెబ్బ దక్షిణ గుజరాత్‌లోని బార్డోలి చక్కెర సహకార సంఘం రూపంలో తగిలింది. 1955లో ప్రారంభమైన 'శ్రీ ఖేదత్ సహకారీ ఖాండ్ ఉద్యోగ్ మండలి' ఆసియాలోనే అతిపెద్ద చక్కెర సహకార సంఘంగా గుర్తింపు పొందింది. దాదాపు 5,684 మంది రైతు సభ్యులతోపాటు సొంతంగా 21 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ద్వారా ఏటా రూ.20 కోట్ల వరకు అదనపు ఆదాయాన్ని ఆర్జించే ఈ కీలక సంస్థపై కాంగ్రెస్ మద్దతు ఉన్న 'కిసాన్ పరివర్తన్ ప్యానెల్' ఘనవిజయం సాధించి మొత్తం 14 స్థానాలనూ కైవసం చేసుకుంది. బార్డోలి ఫలితం ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే, అహ్మదాబాద్ జిల్లా పరిధిలోని ధోల్కా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ ఎన్నికల్లో బీజేపీకి మరో భారీ పరాభవం ఎదురైంది. మూడు దశాబ్దాలుగా ఇక్కడ బీజేపీ మద్దతుదారుల ప్యానెల్ తిరుగులేని ఏకఛత్రాధిపత్యం చలాయిస్తోంది. కానీ, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన 'కిసాన్ వికాస్ ప్యానెల్' వ్యూహాత్మకంగా వ్యవహరించి పోటీ జరిగిన మొత్తం పది స్థానాలనూ గెలుచుకుని పాత వైభవాన్ని చాటింది. ఈ ఓటములు కేవలం ప్రజల అసంతృప్తిని మాత్రమే కాకుండా అధికార పార్టీ అంతర్గత రాజకీయాల్లోనూ రాజుకున్న అసమ్మతిని బయటపెట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+