షుగరు పెరగకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ చిన్న మార్పులతో.. ఇక..!!

మధుమేహ బాధితుల సంఖ్య పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా మధుమేహం తో బాధ పడుతున్న వారు ఎక్కవగా ఉంటున్నారు. మారుతున్న జీవన శైలి.. అలవాట్లు.. ఒత్తిడి ఇందు కు కారణాలుగా చెబుతున్నారు. అయితే, మందులతో పాటుగా కొన్ని చిన్న పాటి మార్పులు సైతం షుగరు బాధితుల్లో మార్పు తీసుకొస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కాగా.. భోజనం తరువాత ఒక్క సారిగా షుగరు పెరిగే వారు తమ ఆహారంలో చిన్న మార్పులతో మధుమేహం నియంత్రణ చేసుకోవచ్చని సూచనలు అందిస్తున్నారు.

మధుమేహం ఉన్నవారికే కాకుండా, సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారిలోనూ భోజనం తర్వాత రక్తంలో చక్కెరలో వచ్చే మార్పులు రోజువారీ శక్తి స్థాయిలు, ఆకలిపై ప్రభావం చూపుతాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే లేదా త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. గ్లైసెమిక్ సూచిక ఎక్కువగా ఉన్న ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరిగి, ఆ తర్వాత తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం, తీపి లేదా ఇతర ఆహారాలపై కోరిక కలగడం, అలసట లేదా నిద్రమత్తు వంటి అనుభూతులు కొందరిలో కనిపించే వీలు ఉంటుంది. భోజనం చేసే క్రమంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా రక్తంలో చక్కెర పెరుగుదలను కొంతవరకు నియంత్రించ‌వ‌చ్చని సూచిస్తున్నారు. ముందుగా పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం అవసమరని చెబుతున్నారు.

కడప సీటు అతనికి ఇవ్వండి.. కూటమి కీలక నేతకు సునీత సిఫారసు..!?
కడప సీటు అతనికి ఇవ్వండి.. కూటమి కీలక నేతకు సునీత సిఫారసు..!?
diabetic-patients-can-control-post-meal-blood-sugar-spikes-with-simple-diet-changes-here-the-repor

ఆహారపు అలవాట్లలో మార్పులతో

ఆహారంలో ముఖ్యంగా ఆకుకూరలు, ఇతర పీచు అధికంగా ఉండే కూరగాయలను భోజనం ప్రారంభంలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఆ తర్వాత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను భోజనంలో భాగంగా చేర్చడం వల్ల కార్బొహైడ్రేట్లు శరీరంలోకి చేరే విధానంపై ప్రభావం చూపుతాయి. చివరిగా బియ్యం, చ‌పాతీ వంటి పిండి పదార్థాలు లేదా చక్కెరలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటే ముందుగా పీచు పదార్థాలు, ఆ తర్వాత ప్రోటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు, చివరగా పిండి పదార్థాలు, చక్కెరలు తీసుకోవడం ఈ భోజన క్రమంలోని ప్రధాన ఉద్దేశం. అధికం గా ప్రాసెస్ చేసిన కార్బొహైడ్రేట్లను తగ్గించడం కూడా రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పాటు అందిస్తాయని చెబుతున్నారు. మధుమేహానికి ముందు దశలో ఉన్నవారికి మొత్తం ఆహారపు అలవాట్లు, శారీరక చురుకుదనం, మందులు, ఇతర ఆరోగ్య పరిస్థితులు కూడా ముఖ్యమేనని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+