Video: గాల్లోనే రాకెట్‌ను పట్టుకున్న స్పేస్ ఎక్స్! చాప్‌స్టిక్స్‌తో స్టార్‌షిప్‌ను బంధించిన వైనం

అంతరిక్ష రంగంలో మరో చారిత్రక మైలురాయి నమోదైంది. ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'స్పేస్ ఎక్స్' సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో.. అంతరిక్షం నుంచి తిరిగి భూమిపైకి వస్తున్న భారీ స్టార్‌షిప్ రాకెట్ అప్పర్ స్టేజ్‌ను లాంచ్ ట్యాడర్‌కు ఉన్న అతిపెద్ద మెకానికల్ చేతులతో (చాప్‌స్టిక్స్) అత్యంత విజయవంతంగా బంధించింది. రాకెట్ల తయారీ ఖర్చును పూర్తిగా తగ్గించి, వాటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకునే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రయోగం దిగ్విజయంగా ముగిసింది.

22 గంటల అంతరిక్ష ప్రయాణం తర్వాత అద్భుత ఘట్టం

టెక్సాస్‌లోని స్టార్‌బేస్ నుంచి నవంబర్ 14న నింగిలోకి దూసుకెళ్లిన 'ఫ్లైట్ 15' (షిప్ 42) రాకెట్.. దాదాపు 22 గంటలకు పైగా అంతరిక్షంలో గడిపింది. భూమికి సుమారు 275 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరిన ఈ నౌక, భూమి చుట్టూ దాదాపు 14 సార్లు తిరిగింది. ఈ ప్రయాణంలో భాగంగా నెక్స్ట్ జనరేషన్ స్టార్‌లింక్ వి3 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రాకెట్ హీట్ షీల్డ్ పనితీరును పరిశీలించేందుకు ప్రత్యేక కెమెరాలతో కూడిన శాటిలైట్లు కూడా ఇందులో కీలక పాత్ర పోషించాయి.

SpaceX Makes History by Catching Starship Upper Stage Midair With Giant Mechanical Arms in Texas
స్టార్‌షిప్ మిషన్ అబార్ట్- చివరి నిమిషంలో
స్టార్‌షిప్ మిషన్ అబార్ట్- చివరి నిమిషంలో

గాల్లోనే 'చాప్‌స్టిక్స్'తో రాకెట్‌ను ఆపిన వైనం

అంతరిక్ష ప్రయాణం ముగిసిన తర్వాత, షిప్ 42 రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించి తన దిశను మార్చుకుంది. ఎలాంటి లోపాలు లేకుండా కచ్చితమైన ల్యాండింగ్ విన్యాసంతో టెక్సాస్‌లోని ల్యాంచ్ ట్యావర్ వైపు దూసుకొచ్చింది. సరిగ్గా ఆదివారం తెల్లవారుజామున 2:52 గంటల ప్రాంతంలో టవర్‌కు అమర్చిన చాప్‌స్టిక్స్ అమాంతం మూసుకుని రాకెట్‌ను గాల్లోనే అడ్డుకున్నాయి. లాంచ్ ప్యాడ్‌పై సురక్షితంగా నిలబెట్టాయి. కక్ష్య నుంచి తిరిగి వచ్చిన స్టార్‌షిప్ నౌకను ఇలా విజయవంతంగా ఒడిసిపట్టడం స్పేస్ ఎక్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.

మరోవైపు సగం నెరవేరిన లక్ష్యం.. సముద్రంలో పడిన బూస్టర్

ఈ ప్రతిష్టాత్మక ప్రయోగంలో రాకెట్‌లోని రెండు భాగాలను (అప్పర్ స్టేజ్, సూపర్‌హెవీ బూస్టర్) ఒకేసారి రికవరీ చేయాలని స్పేస్ ఎక్స్ భావించింది. అయితే చివరి నిమిషంలో సూపర్‌హెవీ బూస్టర్ టవర్ క్యాచ్ ప్లాన్‌ను విరమించుకోవాల్సి వచ్చింది. దీంతో అది మెక్సికో గల్ఫ్ సముద్ర జలాల్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. అయినప్పటికీ, స్టార్‌షిప్ గాల్లోనే పట్టుకోవడంలో సాధించిన ఈ అపూర్వ విజయం కంపెనీ లక్ష్యానికి పెద్ద ఊపునిచ్చింది.

SpaceX Crew-13: నాసా స్పేస్ ఎక్స్ క్రూ-13 ప్రయోగం సక్సెస్.. ISS లోకి నలుగురు వ్యోమగాములు.. 6 నెలలు అక్కడే
SpaceX Crew-13: నాసా స్పేస్ ఎక్స్ క్రూ-13 ప్రయోగం సక్సెస్.. ISS లోకి నలుగురు వ్యోమగాములు.. 6 నెలలు అక్కడే

భవిష్యత్తు అంతరిక్ష యాత్రలకు బాటలు వేస్తున్న స్పేస్ ఎక్స్

రాకెట్లలోని రెండు భాగాలను పూర్తిగా, వేగంగా పునర్వినియోగించుకోవడం ద్వారా ప్రయోగాల ఖర్చును భారీగా తగ్గించవచ్చని స్పేస్ ఎక్స్ నిరూపిస్తోంది. ప్రస్తుత విజయం చంద్రుడు, అంగారక గ్రహాలపైకి భవిష్యత్తులో చేపట్టబోయే మానవ సహిత యాత్రలకు మరింత బలసానిచ్చింది. అంతరిక్ష పరిశోధనలను మరో స్థాయికి తీసుకెళ్లిన ఈ అద్భుత ప్రయోగంపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+