బంగారం ధరల్లో బిగ్ స్లంప్.. !!
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న సమీకరణాల ప్రభావంతో పసిడి, వెండి ధరలు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మున్ముందు కూడా వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు రావడం, క్రూడాయిల్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణ భయాలు వ్యక్తమౌతోండటం దీనికి ప్రధాన కారణాలు. దీని దెబ్బకు కిందటి వారంలో స్పాట్ గోల్డ్ ధర ఏకంగా 4.5 శాతం మేర కుప్పకూలింది. జూన్ తర్వాత పసిడి మార్కెట్‌లో ఒకే వారంలో ఇంతటి భారీ క్షీణత నమోదు కావడం ఇదే మొదటిసారి.
గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ పసిడి ధర ప్రస్తుతం ఔన్సుకు 3,879.71 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అమెరికా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ గణాంకాలు వెలువడినప్పుడు ధర 3,922.97 డాలర్ల గరిష్ఠాన్ని తాకింది గానీ.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. స్పాట్ వెండి ధర 1.9 శాతం తగ్గి ఔన్సుకు 49.05 డాలర్లకు క్షీణించింది. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లలోనూ పసిడి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. కిందటి వారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఏకంగా 5,500 రూపాయల తగ్గుదల నమోదైంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ వద్ద 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,37,620 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్లు రూ. 1,26,150, 18 క్యారెట్లు రూ. 1,03,220 వద్ద నిలిచింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,37,290 రూపాయల వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,25,849గా ఉంది. ఇక 18 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,02,968 గా రికార్డయింది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,37,070, 22 క్యారెట్లు రూ. 1,25,648, 18 క్యారెట్లు రూ. 1,02,803 వద్ద ట్రేడ్ అయ్యాయి.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి..
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,762, 22 క్యారెట్లు - రూ. 12,615, 18 క్యారెట్లు - రూ. 10,330
ముంబై..
24 క్యారెట్లు- రూ. 13,762, 22 క్యారెట్లు - రూ. 12,615, 18 క్యారెట్లు - రూ. 10,322
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 13,762, 22 క్యారెట్లు - రూ. 12,615, 18 క్యారెట్లు - రూ. 10,322
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 13,762, 22 క్యారెట్లు - రూ. 12,615, 18 క్యారెట్లు - రూ. 10,322
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 13,762, 22 క్యారెట్లు - రూ. 12,615, 18 క్యారెట్లు - రూ. 10,322
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 13,762, 22 క్యారెట్లు - రూ. 12,615, 18 క్యారెట్లు - రూ. 10,322












Click it and Unblock the Notifications
