"వైజాగ్ గురించి మాట్లాడితే ఇంత ట్రోలింగా ?"- హీరోయిన్ చాందినీ చౌదరి ఆవేదన..!

ఏపీలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో ఒకటైన విశాఖపట్నంలో పర్యావరణ విధ్వంసంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా అభివృద్ది మాటున పర్యావరణాన్ని విధ్వంసం చేయడంలో ఏ ప్రభుత్వం అయినా పరిస్దితుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఇలాంటిదే విశాఖలో కొండల్ని చెక్కేస్తున్న ఓ దృశ్యం టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరి (Chandini Chowdary) కంట పడింది. దీనిపై ఆమె తీవ్ర ఆవేదనతో ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టారు.

జగన్ ఫ్యామిలీపై జనసైనికుల రోత వ్యాఖ్యలు- ఏపీ మహిళా కమిషన్ ఫైర్..!
జగన్ ఫ్యామిలీపై జనసైనికుల రోత వ్యాఖ్యలు- ఏపీ మహిళా కమిషన్ ఫైర్..!

అందులో చాందినీ చౌదరి...."నా సొంత ఊరు విశాఖపట్నం పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. పట్టణీకరణ, అభివృద్ధి పేరుతో ఎక్కడ చూసినా కొండలను, పర్వతాలను నిర్దాక్షిణ్యంగా తవ్వేస్తున్నారు." అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమెకు టార్చర్ మొదలైంది. ముఖ్యంగా కూటమి పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆమె కామెంట్స్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా చాందినీని వైసీపీ కార్యకర్తగా అభివర్ణిస్తూ పోస్టులు పెట్టడం, వైసీపీ హయాంలో ఇలాంటి వాటిపై స్పందించారా అని ప్రశ్నించడం ఎక్కువైంది. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

Vizag Environmental Row Actress Chandini Chowdary Breaks Down Over Online Trolling
రాజమండ్రిలో కాకినాడ సీన్ రిపీట్ ? మేయర్ పోరులో బీజేపీలో బిగ్ టెన్షన్..!
రాజమండ్రిలో కాకినాడ సీన్ రిపీట్ ? మేయర్ పోరులో బీజేపీలో బిగ్ టెన్షన్..!

ఇందులో తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై చాందినీ చౌదరి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆవేదనతో కూడిన స్వరంతో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో మనకు బాధ కలిగించే విషయం ఏదైనా జరిగినప్పుడు మర్యాదగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే హక్కు పార్టీలకతీతంగా అందరికీ ఉండాలని చాందిని తెలిపారు. అది మనకు ఉన్న కనీస హక్కు అన్నారు. ఇతరుల అభిప్రాయంపై స్పందించే క్రమంలో .. వారి వ్యాఖ్యల్ని మనకు అనుకూలంగా మార్చుకుని విమర్శలు చేస్తూ, పార్టీలకు అంటగట్టడం సరికాదన్నారు. తనకు ఎప్పటికీ తన దేశమే ప్రాధ్యాన్యత అని చాందినీ చౌదరి ముగించారు. .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+