రజనీకాంత్ 'ధర్మన్' లో రామ్ పోతినేని.. క్రేజీ లుక్ రిలీజ్.. సోషల్ మీడియా షేక్..

కోలీవుడ్ సూపర్ ​స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన లేటెస్ట్ మూవీ 'జైలర్2' ఇప్పటికే రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్‌ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా జైలర్‌ 2 నిలిచింది. అక్టోబర్ 15న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకూ రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు ఎస్‌ జే సూర్య, విద్యా బాలన్‌, మిథున్‌ చక్రవర్తి, యోగిబాబు, రమ్యకృష్ణ, సూరజ్‌ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. ఇక మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌ లు గెస్ట్ రోల్స్ లో అలరించారు.

RamPothineni latest poster glimpse powerful look from Rajinikanth s Dharman has been released now

ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో.. ఈ సీక్వెన్స్ కూడా అదిరిపోయే ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుని బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ ‌గా నిలిచింది. అయితే ప్రస్తుతం రజనీకాంత్ 'ధర్మన్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన అంతకుముందు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ ​పై స్వయంగా నిర్మిస్తున్న ఆ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ధర్మన్ మూవీ నుంచి తాజాగా అద్దిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఒక కీలక పాత్రను పోషిస్తున్నట్లు వస్తున్న వార్తలను నిజం చేస్తూ ఆయన క్యారెక్టర్‌ ను పరిచయం చేస్తూ చిత్ర బృందం అధికారికంగా ఒక వీడియోను విడుదల చేసింది. రా.. ఆటిట్యూడ్.. పవర్.. ఓవర్‌ లోడెడ్.. అందరికీ స్వాగతం అనే పవర్‌ ఫుల్ క్యాప్షన్‌ తో రామ్ పాత్రను పరిచయం చేశారు. ఈ సినిమాలో రామ్ చాలా స్టైలిష్ లుక్ లో ఇస్మార్ట్ శంకర్ రోజులను గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ పోతినేని లుక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+