Happy Journey Review: 'హ్యాపీ జర్నీ' రివ్యూ.. హిట్టా.. ఫట్టా?

Happy Journey Review: డైరెక్టర్ అభిరామ్ నాయుడు దర్శకత్వంలో మహిళా ప్రాధాన్య కథాంశంతో తెరకెక్కిన సినిమా 'హ్యాపీ జర్నీ'. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, సునైనా బాదం, వంశీధర్ గౌడ్, రవి శివతేజ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పించిందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

The Paradise Censor Review: నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ రివ్యూ.. థియేటర్ల పరిస్థితి ఏంటో..??
The Paradise Censor Review: నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ రివ్యూ.. థియేటర్ల పరిస్థితి ఏంటో..??

స్టోరీ
వివిధ రకాల నేపథ్యాలు ఉన్న ఏడుగురు మహిళలు.. సావిత్రి(అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి(ఆమని), నయన, శ్రీలత(ఝాన్సీ), తన్వి(పాయల్ రాధాకృష్ణ), దివ్య(సునైనా), విహాన ఓ లక్కీ డ్రా ద్వారా యూరప్ ట్రిప్ వెళ్లే అవకాశం గెలుచుకుంటారు. 'గ్రేట్ ఆంధ్రా ట్రావెల్స్' నిర్వాహకులు గోవింద్(వంశీధర్ గౌడ్), అప్పారావు(రవి శివతేజ) వీరి గైడ్లుగా వ్యవహరిస్తారు. సరదాగా సాగిపోయే ఈ జర్నీలో అనుకోని మలుపులు, కుటుంబ బంధాలు, జీవిత సత్యాల చుట్టూ కథ ఎలా మలుపు తిరిగిందనేది మిగతా స్టోరీ.

Happy Journey Review Hit or Flop Movie Rating and Analysis starring Abhiram Naidu Annapurnamma Aamani

విశ్లేషణ
డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్, చెప్పాలనుకున్న సందేశం చాలా బాగున్నాయి. ఫస్టాఫ్, సెకండాఫ్‌లో అక్కడక్కడ వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ముఖ్యంగా వంశీధర్ గౌడ్ అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకోగా.. రవి శివతేజతో ఆయన కాంబినేషన్ బాగుంది. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మోడ్రన్ అవతారంలో అలరించగా.. ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ తమ పూత్రలకు పూర్తి న్యాయం చేశారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.

'కాకా’ మూవీలో మెగాస్టార్ సరసన అలనాటి హీరోయిన్!
'కాకా’ మూవీలో మెగాస్టార్ సరసన అలనాటి హీరోయిన్!

మైనస్ పాయింట్లు
కొన్ని అనవసరమైన సీన్లు, కొన్ని రిపీటెడ్ సన్నివేశాల వల్ల కథనం కాస్త నెమ్మదించినా పరవాలేదనిపిస్తుంది. ప్రతినాయిక పాత్రకు సంబంధించిన భావోద్వేగాలను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది. కామెడీకి, ఎమోషన్ కు మధ్య సరైన సమతుల్యత లోపించినట్లు అనిపిస్తుంది. పాత్రల మధ్య వచ్చే గొడవలు చాలా తొందరగా పరిష్కారం అయిపోవడం వల్ల కొన్ని సీన్లు సహజత్వానికి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ కాస్త హడావిడిగా అనిపిస్తుంది.

సాంకేతికత
సాంకేతికంగా సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్, సుబ్రమణియన్ మణిగండన్ విజువల్స్ యూరప్ అందాలను అద్భుతంగా ఆవిష్కరించాయి. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. హేమంత్ ధోమే కథ బాగున్నా, అభిరామ్ నాయుడు కథనాన్ని మరికొంత గ్రిప్పింగ్ గా తీర్చిదిద్ది ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది.

ఫైనల్‌గా ..
'హ్యాపీ జర్నీ' కొన్ని మంచి నవ్వులు, సందేశం కావాలనుకునేవారికి బెస్ట్ ఛాయిస్.

రేటింగ్: 3/5.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+