MDR: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్లు బంద్! డీలర్ల అల్టిమేటం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యూపీఐ నిబంధనల ప్రకారం.. పెట్రోల్ బంకుల్లో రూ.2,000 దాటి జరిగే లావాదేవీలపై రూ.5 స్థిరంగా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించనున్నారు. ఈ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ డీలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీటరుకు నిర్ణీత కమీషన్ ప్రాతిపదికన నడిచే తమ వ్యాపారంలో ఈ భారం నేరుగా మార్జిన్‌పై పడుతుందని వాపోతున్నారు. ఈ మేరకు ఈ అదనపు భారాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి డిజిటల్ చెల్లింపులను పూర్తిగా నిలిపివేసి కేవలం నగదు మాత్రమే స్వీకరిస్తామని ఏపీ పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ స్పష్టం చేసింది.
నిత్యం 1.8 కోట్ల లావాదేవీలు.. నిలిచిపోతే తీవ్ర ఇబ్బందులు!
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 5,000 వరకు పెట్రోల్ బంకులు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం ప్రజలు డిజిటల్ లావాదేవీల వైపే మొగ్గు చూపుతుండటంతో ఏపీలోని బంకుల్లో రోజుకు సగటున 1.8 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, కార్ల యజమానులు, లారీ/రవాణా రంగానికి చెందిన వాహనదారులు భారీ మొత్తంలో ఇంధనం కొనుగోలు చేసేటప్పుడు యూపీఐ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు.

అక్టోబర్ 15 నాటికి సమస్య పరిష్కారం కాకపోతే..
రూ.2,000 పైన ఆయిల్ కొట్టించుకునే వారు వారు తప్పనిసరిగా పెట్రలో బంకులకు నోట్ల కట్టలతో రావాల్సి వస్తుంది. చిల్లర సమస్యలు, నగదు లెక్కలతో బంకుల వద్ద వెయిటింగ్ సమయం విపరీతంగా పెరుగుతుంది. అంతిమంగా డిజిటల్ విప్లవానికి బ్రేక్ పడే అవకాశం ఉంది
కేంద్రంతో చర్చలు.. ఏం జరగనుంది?
ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పెట్రోలియం శాఖ అధికారులతో భేటీ అయి పెట్రోల్ బంకులను ఈ MDR పరిధి నుంచి పూర్తిగా మినహాయించాలని కోరారు. అయితే, UPI డిజిటల్ నెట్‌వర్క్ మౌలిక వసతుల నిర్వహణ కోసమే ఈ ఫ్లాట్ చార్జీలు అవసరమని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. మరోవైపు రోజువారీ ప్రయాణికుల కోసం రూ.2,000 లోపు ఉండే లావాదేవీలపై ఎలాంటి రుసుము (0% MDR) ఉండదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం డీలర్ల డిమాండ్‌పై ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.














Click it and Unblock the Notifications
