జగన్ నివాసానికి షర్మిల - బెంగళూరు కేంద్రంగా..!!

మాజీ సీఎం జగన్ ఇంటికి సోదరి షర్మిల. ఇద్దరూ కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. జగన్ తో విభేదించిన షర్మిల కాంగ్రెస్ లో చేరి పీసీసీ చీఫ్ అయ్యారు. కాగా.. ఇప్పుడు షర్మిల తన కుమార్తె వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. కాగా.. సడన్ గా తన అన్న జగన్ నివాసానికి షర్మిల తన కుటుంబంతో సహా వెళ్లటం ఆసక్తి కరంగా మారుతోంది. ప్రస్తుతం విజయమ్మ కుటుంబం.. పార్టీలో వ్యవహారాలన్నీ పూర్తగా చక్కబెట్టే బాధ్యత తీసుకున్నా రనే వార్తల వేళ ఈ భేటీ ఆసక్తి కరంగా మారుతోంది.

మాజీ సీఎం జగన్ తో సోదరి షర్మిల తన కుటుంబ సభ్యులతో సహా కలిసి సమావేశం కానున్నారు. ఇందు కోసం బెంగళూరులోని జగన్ నివాసం వేదిక కానుంది. ఈ సాయంత్రం షర్మిల తన అన్నను కలుస్తారని పార్టీ నేతల సమాచారం. తన కుమార్తె వివాహం ముహూర్తం షర్మిల ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

 వైసీపీ మరో పోరు బాట, ప్రతీ మండలంలో- జిల్లాలకు జగన్..అక్కడే..!!
వైసీపీ మరో పోరు బాట, ప్రతీ మండలంలో- జిల్లాలకు జగన్..అక్కడే..!!
YS Sharmila to meet YS jagan to invite for her daughter Marriage along with mother Vijayamma

ఈనెల 24న నిశ్చితార్థం, నవంబర్ 25న వివాహం, డిసెంబర్ 5న రిసెప్షన్ వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మూడు శుభకార్యాల సమాచారాన్ని దేవుడి ఆశీస్సులతో వైఎస్సార్ ఘాట్ వద్ద నుంచి పంచుకోవడం ఆనందంగా ఉందని షర్మిల సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. కాగా.. తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు షర్మిల బెంగళూరు వెళ్లినట్లు పార్టీ నేతల సమాచారం.

షర్మిల కుమార్తె నిశ్చితార్దం 24న హైదరాబాద్ లో, 25న వివాహం బెంగళూరులో జరగనుంది. డిసెంబర్ 5న హైదరాబాద్ లో వివాహ రిసిప్షెన్ కు నిర్ణయించారు. దీంతో.. తన తల్లి విజయమ్మతో పాటుగా కుటుంబ సభ్యు లతో కలిసి వివాహానికి ఆహ్వానించేందుకు షర్మిల సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయమ్మ కుటుంబం, పార్టీలో కీలక పాత్ర పోషించేందుకు సిద్దమైనట్లు సమాచారం. అందులో భాగంగా కొందరిలో చర్చలె సైతం చేసినట్లు చెబుతున్నారు.

 వైసీపీలోకి మాజీ మంత్రి రీ ఎంట్రీ - జగన్ కొత్త స్కెచ్..!!
వైసీపీలోకి మాజీ మంత్రి రీ ఎంట్రీ - జగన్ కొత్త స్కెచ్..!!

కొంత కాలంగా జగన్ పైన షర్మిల విమర్శల తీవ్రత తగ్గింది. ఈ సమయంలో షర్మిల కుమార్తె వివాహానికి ఆహ్వానం పలికేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి జగన్ హాజరైన సమయంలో చోటు చేసుకున్న సన్నివేశాల పైన అభిమానుల్లో చర్చ జరిగింది. దీంతో.. ఇప్పుడు షర్మిల తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు వెళ్లటం.. జగన్ స్పందించే తీరు ఆసక్తి గా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+