విజయ్ కు తమిళనాడు గవర్నర్ గుడ్ న్యూస్..! అదొక్కటే రాష్ట్రపతికి..!
తమిళనాడులో గత డీఎంకే ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న ఎంకే స్టాలిన్ కూ, గవర్నర్లకూ అస్సలు పొసిగేది కాదు. ముఖ్యంగా అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుల్ని సైతం గవర్నర్లు ఆమోదించకుండా తొక్కిపెట్టేవారు. అడిగితే రాష్ట్రపతి పరిశీలనకు పంపినట్లు చెప్పేవారు. చివరకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లడం, చివరకు రాష్ట్రపతికి సైతం ఆదేశాలు ఇవ్వడం, వాటిని ఆమె సవాలు చేయడం కూడా జరిగాయి. చివరకు గవర్నర్లకు బిల్లుల ఆమోదానికి పెట్టిన మూడు నెలల గడువు అంశం ఎటో పోయింది.
సీన్ కట్ చేస్తే తమిళనాట నాలుగు నెలల క్రితం విజయ్ నేతృత్వంలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. తాజాగా తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించుకుంది. ఇందులో ప్రభుత్వం మొత్తం 13 బిల్లుల్ని ఆమోదించింది. అనంతరం వీటిని గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఇందులో రాష్ట్రపతి రాజేంద్ర అర్లేకర్ (Tamil Nadu Governor) 12 బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. కేవలం ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును మాత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పరిశీలనకు పంపారు.

ఈ మేరకు తమిళనాడు గవర్నర్ అర్లేకర్ ఆమోదించిన బిల్లుల్లో డీటీసీపీ, ఎమ్మెల్యేల వాహనాలు, తమిళనాడు పెట్టుబడుల ప్రోత్సాహక కమిషన్, టాస్మాక్ మద్యంపై వ్యాట్ , పట్టణ స్థానిక సంస్థలకు టీఎన్పీఎస్సీ ద్వారా నియామకాలకు సంబంధించిన సవరణలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును మాత్రం రాష్ట్రపతి పరిశీలనకు పంపేందుకు వీలుగా పక్కనపెట్టారు. ఈ విషయంపై ప్రభుత్వానికి లోక్ భవన్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే తమిళనాడులో సీఎం, గవర్నర్ల మధ్య పోరు కాస్త తగ్గినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీని వెనుక గతంలో స్టాలిన్ కేంద్రంతో వ్యవహరించిన తీరుకూ, విజయ్ ప్రస్తుతం మోడీ సర్కార్ తో వ్యవహరిస్తున్న తీరుకూ మధ్య తేడాయే అని తెలుస్తోంది.















Click it and Unblock the Notifications
