ఇలాంటివన్నీ అతని ముందు జుజూబీ: తలకిందులుగా వేలాడుతూ స్టార్ హీరో ఫస్ట్ లుక్ అవుట్
నేడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర రావ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ఓ సర్ ప్రైజ్ లభించింది. ఆయన నటిస్తోన్న జాంబీ రెడ్డి 2 - నెక్స్ట్ లెవెల్ (Zombie Reddy 2 - Nxt Lvl) ఫిల్మ్ నుంచి ఫస్ట్ లుక్ విడుదల అయింది. 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా జాంబీ రెడ్డికి సీక్వెల్ ఇది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఇదివరకే ఫిల్మ్ అనౌన్స్ మెంట్ జరిగింది కూడా. హీరో తేజ సజ్జ బర్త్ డే నాడు టైటిల్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పుడు తాజాగా ఈ ఫిల్మ్ లో కీలక పాత్ర పోషిస్తోన్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ విడుదల అయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఉపేంద్ర.. ఓ ఇంటెన్స్, పవర్‌హౌస్ పాత్రలో పలకరించబోతున్నారు. ఆయన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ షనాయా కపూర్ ఈ యాక్షన్ డ్రామా ద్వారా సౌత్ ఇండియన్ ఫిల్మ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోన్నారు.

ఈ క్రేజీ సీక్వెల్ నిర్మాణ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ చేపట్టారు. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ది ఫ్యామిలీ మేన్ 2, రానా నాయుడు, హక్ వంటి సిరీస్‌లకు పనిచేసిన సుపర్ణ్ ఎస్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు క్రియేటర్‌గా వ్యవహరిస్తూ కథా చర్చల్లో కీలక పాత్ర పోషించడం సినిమాపై అంచనాలను పెంచింది.
ఈ డిఫరెంట్ జాంబీ చిత్రానికి హుస్సేన్ దలాల్, ప్రశాంత్ వర్మ, సుపర్ణ్ ఎస్ వర్మ కలిసి అద్భుతమైన స్క్రీన్‌ప్లేను సిద్ధం చేశారు. హనుమాన్, మిరాయ్ సినిమాల విజయాల తర్వాత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి ఈ సీక్వెల్‌కు అదిరిపోయే సంగీతాన్ని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించబోతున్నాడు. ప్రశాంత్ వర్మ క్రియేటివ్ భాగస్వామ్యంతో వచ్చే కథ కావడంతో ఈ సినిమా సంగీతం పరంగా సరికొత్త అనుభూతిని ఇస్తుందని యూనిట్ చెబుతోంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, నేపాలీ, జపనీస్ భాషల్లో కూడా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.












Click it and Unblock the Notifications
