దానం నాగేందర్ పై అనర్హత వేటు - హైకోర్టు సంచలన తీర్పు..!!

దానం నాగేందర్ కు హైకోర్టులో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ వ్యవహారం పై హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. దానం బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరటం పైన హైకోర్టులో దాఖలైన పిటీషన్ ను న్యాయస్థానం విచారణ చేసింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్‌ బీ-ఫారంతో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి పోటీచేయడం ఈ కేసులో కీలకంగా మారింది. ఈ పిటీషన్ ను విచారణ చేసిన న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెల్లడించింది.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం పై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్ని కై, ఆ తర్వాత కాంగ్రెస్‌ తరఫున సికింద్రాబాద్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన దానంపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను స్పీకర్‌ కొట్టివేసారు దీంతో.. ఇదే అంశం పైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌సింగ్‌, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం విచారణ చేసింది.

రూపాయికే డిఫెన్స్ కాంట్రాక్ట్.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!
రూపాయికే డిఫెన్స్ కాంట్రాక్ట్.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!
Telangana High Court pronounced judgement over Danam nagendar disqualification petition here the details

బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్‌.. ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరారని, పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, కే వివేక్‌రెడ్డి ఇప్పటికే హైకోర్టుకు తెలిపారు. ముఖ్యంగా దానం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్‌ బీ-ఫారంతో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి పోటీచేయడం ఈ కేసులో అత్యంత కీలక ఆధారమని తమ వాదనల్లో స్పష్టం చేసారు.

అదే విధంగా పార్టీ ఫిరాయింపును నిర్ధారించేందుకు అసెంబ్లీ లోపల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల న్న స్పీకర్‌ వైఖరిని పిటిషనర్లు వ్యతిరేకించారు. మరో పార్టీ తరఫున పోటీచేయడం ద్వారా అసలు పార్టీ పట్ల తన రాజకీయ అనుబంధాన్ని వదులుకు న్నట్టు స్పష్టమవుతున్నప్పుడు వేరే ఆధారాల కోసం చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్పీకర్‌ నిర్ణయం న్యాయపరమైన పరిశీలనకు లోబడి ఉంటుందని, స్పీకర్‌ అధికారాలు అపరిమిత మైనవి కావని వాదించారు. పిటిషనర్ల వాదనలతో దానం నాగేందర్‌ న్యాయవాది వ్యతిరేకించారు.

ఏపీలో బీసీ, కాపు రిజర్వేషన్లపై హైకోర్టు షాకింగ్..! ఇరుకునపడ్డ సర్కార్..!
ఏపీలో బీసీ, కాపు రిజర్వేషన్లపై హైకోర్టు షాకింగ్..! ఇరుకునపడ్డ సర్కార్..!

ఆయన బీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నట్టు ఎకడా ప్రకటించలేదని తెలిపారు. దానం ఇప్పటికీ అసెంబ్లీ రికార్డుల్లో బీఆర్‌ఎస్‌ సభ్యుడిగానే ఉన్నారని చెప్పారు. దానం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసినంత మాత్రాన అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయినట్టు భావించరాదని వాదించారు. వాదనలు విన్న తరువాత ధర్మాసనం దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో.. ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+