బాక్సాఫీస్‌ను దడదడలాడిస్తున్న ఓటీటీ సినిమా.. కలెక్షన్ల సునామీ!

ఓటీటీ ప్రపంచాన్ని దద్దరిల్లజేసిన 'మీర్జాపూర్' ఇప్పుడు వెండితెరపై కూడా సంచలనాలు సృష్టిస్తోంది. మూడు సీజన్లతో దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ క్రైమ్ డ్రామా.. తాజాగా 'మీర్జాపూర్: ది మూవీ' పేరుతో థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ ఆడిస్తోంది. సెప్టెంబర్ 4న విడుదలైన ఈ సినిమా, ఓటీటీ ఫ్రాంచైజీలు థియేటర్లలో వర్కవుట్ కావనే అంచనాలను తలకిందులు చేస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

ప్రధాని మోదీ 15 ఏళ్ల వయసులో చూసిన సినిమా!
ప్రధాని మోదీ 15 ఏళ్ల వయసులో చూసిన సినిమా!

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత

అలీ ఫజల్, దివ్యేందు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.220.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా, నెట్ కలెక్షన్స్ దాదాపు రూ.184.79 కోట్లుగా ఉన్నాయి. కేవలం తొలి రోజే రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి తన రేంజ్ ఏంటో నిరూపించుకున్న ఈ మూవీ, ఆ జోరును కొనసాగిస్తూ తక్కువ సమయంలోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది.

బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న చిన్న సినిమా .. 4 రోజుల్లోనే రూ. 65 కోట్ల రచ్చ
బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న చిన్న సినిమా .. 4 రోజుల్లోనే రూ. 65 కోట్ల రచ్చ
Mirzapur OTT Movie Makes Waves at the Box Office With Massive Collections

ఎందుకంత క్రేజ్?

2018లో ఓటీటీలోకి అడుగుపెట్టిన 'మీర్జాపూర్' మొదటి సీజన్‌తోనే అదరగొట్టింది. ఆ తర్వాత వచ్చిన రెండు, మూడు సీజన్లు ఈ సిరీస్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. పచ్చి నిజాలు, ముడి క్రైమ్, పవర్ పాలిటిక్స్, పాత్రల మధ్య వచ్చే అనూహ్య ట్విస్టులు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. ముఖ్యంగా కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డు పండిట్ (అలీ ఫజల్), మున్నా భయ్యా (దివ్యేందు) పాత్రలు తెలుగు ప్రేక్షకులతో సహా అందరినీ ఫిదా చేశాయి.

వెండితెరపై సరికొత్త అనుభూతి

ఇప్పుడు అదే చీకటి ప్రపంచాన్ని మరింత భారీ క్యాన్వాస్‌పై 'మీర్జాపూర్: ది మూవీ' రూపంలో తెరకెక్కించారు. మొదటి సీజన్‌కు ముందు జరిగిన కొన్ని కీలక సంఘటనలు, ఎవరికీ తెలియని రహస్యాలను ఈ సినిమాలో ఆవిష్కరించడంతో అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందులతో పాటు రసిక దుగల్, శ్వేతా త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ వంటి పాత తారలతో పాటు.. జితేంద్ర కుమార్, రవి కిషన్, సోనాల్ చౌహాన్ వంటి కొత్త నటులు చేరి సినిమాను మరింత రక్తి కట్టించారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మొత్తానికి, ఓటీటీ రారాజుగా ఏలిన మీర్జాపూర్.. ఇప్పుడు బాక్సాఫీస్ బాస్ తానేనని మరోసారి నిరూపించుకుంటోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+