ఏపీలో మురికివాడల ప్రజలకు శుభవార్త.. మీకోసమే హైరైజ్ అపార్ట్మెంట్స్, నెలకు వెయ్యిలోపు కడితే చాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మురికివాడల ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశాఖపట్నం నగరంలో పూర్ణా మార్కెట్ దగ్గర వెలంపేట లక్ష్మీనగర్‌లో ఐదు దశాబ్దాలుగా మురికివాడలో జీవిస్తున్న కుటుంబాలకు ఇప్పుడు కొత్త జీవితం దక్కనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికోసం 12 అంతస్తుల ఎత్తైన హైరైజ్ అపార్ట్‌మెంట్ నిర్మిస్తోంది. మొత్తం 177 కుటుంబాలు ఈ కొత్త ఇళ్లలోకి మారనున్నాయి.

ఇప్పటివరకు ఈ కుటుంబాలు 59 సెంట్ల స్థలంలో రేకుల షెడ్లలో నివసిస్తూ ఉండేవి. ఇరుకైన స్థలం, సరిపడని సౌకర్యాలు ఇలాంటి పరిస్థితుల నుంచి వారిని మార్చి, వారికి పక్కా ఇళ్ళను అందించే ప్లాన్ లో భాగంగా హైరైజ్ అపార్ట్ మెంట్స్ నిర్మించి వారికి ఫ్లాట్ లను అందించనుంది ప్రతి కుటుంబానికి 410 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్ ఉన్న 1BHK ఫ్లాట్ ఇవ్వనుంది. దీనికి లబ్ధిదారులు కేవలం రూ.3.5 లక్షలు మాత్రమే చెల్లించాలి.

slum areas highrise apartments ap govt good news for slum people flot with 1 000 emi for month

ఈ మొత్తాన్ని నెలకు వెయ్యి రూపాయల లోపు ఈఎంఐల రూపంలో చెల్లించేలా వీలు కల్పించింది. దీంతో మురికివాడల ప్రజలపై ఆర్థికభారం పెద్దగా పడకుండా చేయనుంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.28.44 కోట్లు. ఒక్కో యూనిట్ విలువ రూ.16.07 లక్షలు ఉంటుంది. ఇందులో కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.1.5 లక్షలు, రాష్ట్రం రూ.1 లక్ష సబ్సిడీ ఇస్తోంది. మిగతా భాగాన్ని డెవలపర్ భరిస్తాడు.

ఈ ప్రాజెక్టును డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ట్రాన్స్‌ఫర్ నమూనాలో నడుపుతున్నారు. 2,691 చదరపు గజాల స్థలంలో స్టిల్ట్ ప్లస్ 12 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. మొదటి 11 అంతస్తుల్లో ఒక్కో అంతస్తుకు 15 ఫ్లాట్లు, పై అంతస్తులో 12 ఫ్లాట్లు ఉంటాయి. షీర్ వాల్ టెక్నాలజీతో ఈ బహుళ అంతస్తుల భవనం నిర్మాణం జరుగుతోంది. దీనివల్ల త్వరగా ఈ నిర్మాణం పూర్తవుతుంది. తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.

ఏపీకి కేంద్రం వరం.. నాలుగు విమానాశ్రయాలకు అదనపు హంగులు!
ఏపీకి కేంద్రం వరం.. నాలుగు విమానాశ్రయాలకు అదనపు హంగులు!

లిఫ్ట్, నిరంతర నీటి సరఫరా, బైక్ పార్కింగ్ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. డెవలపర్‌కు ప్రోత్సాహంగా 1:4 నిష్పత్తిలో టీడీఆర్ ఇస్తున్నారు. పార్కింగ్ నిబంధనలు సడలించి, అనుమతి ఫీజులు రద్దు చేశారు. ఇది రాష్ట్రంలో ఈ తరహాలో చేపట్టిన మొదటి ప్రాజెక్టు. ఇది విజయవంతమైతే ఇతర మురికివాడల్లో కూడా ఇలాంటి నమూనానే అమలు చేసి మురికివాడలు లేని రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. చాలా కాలంగా కష్టపడుతున్న ఈ కుటుంబాలకు ఇప్పుడు సురక్షితమైన, గౌరవప్రదమైన ఇల్లు దక్కనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+