రష్యాపై కనీవినీ ఎరుగని భారీ దాడి: మాస్కోలో సైతం.. !!

రష్యాపై ఉక్రెయిన్ ఇదివరకెప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో డ్రోన్ల దాడికి దిగింది. మాస్కోతో పాటు దేశంలోని అనేక కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 1,000కి పైగా డ్రోన్లను ప్రయోగించింది. మాస్కో చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద డ్రోన్ దాడిగా స్థానిక పాలనా యంత్రాంగం అభివర్ణించింది. రష్యా పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యూహాత్మక దాడి చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. వాయుసేన, సరిహద్దు రక్షణ దళాలు సుమారు 1,100 ఉక్రేనియన్ డ్రోన్లను విజయవంతంగా కూల్చివేశాయి. రష్యా ప్రధాన భూభాగంలోని వివిధ నగరాలతో పాటు క్రిమియా, బ్లాక్ సీ తీర ప్రాంతాలలో ఈ వైమానిక దాడులను తిప్పికొట్టినట్లు రష్యా సైనిక వర్గాలు తెలిపాయి. ఈ స్థాయిలో ఏకకాలంలో భారీ సంఖ్యలో డ్రోన్లు దూసుకురావడం రష్యా సైనిక రక్షణ వ్యూహాలకు అతిపెద్ద సవాల్ గా మారింది.

Ukraine fires more than 1000 drones at Russia including largest ever attack on Moscow Confirms Mayor

ఈ విధ్వంసకర డ్రోన్ దాడులపై మాస్కో నగర మేయర్ సెర్గీ సోబ్యానిన్ స్పందించారు. తమ రాజధాని నగరం వైపు దూసుకొచ్చిన కనీసం 450 డ్రోన్లను గాల్లోనే కూల్చివేసినట్లు ప్రకటించారు. అయినప్పటికీ.. కొన్ని డ్రోన్లు రక్షణ వలయాన్ని ఛేదించుకుని మాస్కోలోని అత్యంత కీలకమైన ఆయిల్ రిఫైనరీ, ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఢీకొట్టాయని చెప్పారు. ఈ ఘటనల వల్ల ఎంత మేర నష్టం సంభవించిందనే విషయంపై ఆరా తీస్తున్నామని అన్నారు.

విశాఖపట్నం బీచ్ లో ఇకపై..
విశాఖపట్నం బీచ్ లో ఇకపై..

రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత మాస్కో ఈ స్థాయిలో భీకర వైమానిక దాడిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. సాధారణంగా సరిహద్దు ప్రాంతాలకే పరిమితం అయ్యే డ్రోన్ వ్యూహాన్ని.. ఈసారి ఉక్రెయిన్ నేరుగా రష్యా గుండెకాయలాంటి నగరాలకు విస్తరించింది. రష్యాలో మూడు రోజుల పాటు సాగిన ప్రతిష్టాత్మక పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ చివరి రోజైన ఆదివారం నాడే ఈ దాడులు జరిగాయి.

అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ ఏదీ లేకుండానే ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. పుతిన్ నాయకత్వాన్ని, క్రెమ్లిన్ సార్వభౌమత్వాన్ని మరింత బలోపేతం చేసే తరుణంలో ఉక్రెయిన్ ఈ తరహా భారీ ప్రతిఘటనకు దిగడం చర్చనీయాంశమైౌంది. భవిష్యత్తులో ఉక్రెయిన్ నుంచి వచ్చే ఇలాంటి అత్యాధునిక వైమానిక దాడులను నిలువరించేందుకు రష్యా తన భద్రతా వ్యూహాలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+