పట్టాదార్ పాపు పుస్తకాల పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ స్పీడ్ తో పాలన కొనసాగుతుందన్నారు. ప్రజల ఉత్సాహం చూస్తూంటే, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ దే విజయమనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాల్లో ఎవరి ఫొటో వేసుకోడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తే జేజేలు కొడతారని పేర్కొన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
సీఎం చంద్రబాబు కలిదిండిలో మీ భూమి - మీ హక్కు బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7700 గ్రామాల్లో 32 లక్షల 32 వేల పాస్ పుస్తకాలు ఇచ్చామని ప్రస్తావించారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఉపయోగించి పాస్ పుస్తకాలు చేయించామని తెలిపారు. దానిలోని వివరాలు ఎవరు మార్చలేరని అన్నారు. 9365 గ్రామాల్లో 68 లక్షల 64వేల పాస్ పుస్తకాలు ఇవ్వాలని తెలిపారు. రాబోయే ఏడు నెలల్లో వాటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను అణిచివేస్తామని సీఎం వార్నింగ్ ఇచ్చారు.పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ గౌరవప్రదమైన కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ఆత్మగౌరవానికి సంబంధించిన కార్యక్రమమని చెప్పారు. కోటి మందికి పట్టాలు ఇచ్చేటప్పుడు అవినీతి జరుగుతుందని.. అది జరగకుండా ఉండాలనే గ్రామసభల్లో ఇచ్చామని ప్రస్తావించారు. ప్రజలు కూడా కుటుంబ వివాదాలు తగ్గించుకుని, లిటిగేషన్లు లేకుండా చూడాలని సూచించారు. తాను నాలుగోసారి సీఎంగా చేస్తున్నానని.. సీఎం పదవి తనకు కొత్తమే కాదని చెప్పారు. అప్పటికన్నా స్పీడు పెంచానని.. టెక్నా లజీ కూడా పెంచామని వెల్లడించారు.

రైతులకు చంద్రబాబు భరోసా
ఏలూరు జిల్లాలో ఎక్కడ చూసినా చేపల చెరువులు ఉంటాయని ప్రస్తావించారు.. తాగునీరు మాత్రం ఉండదని చెప్పారు. కైకలూరులో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.36 కోట్లను మంజూరు చేశామని తెలిపారు. సూపర్ సిక్స్ అమలు చేశామని స్పష్టం చేశారు. గుంతలు లేని రోడ్లపై సజావుగా ప్రయాణం చేసేలా చేస్తామని వెల్లడించారు.ఇప్పటికే గడ్డు పరిస్థితులు అధిగమిస్తూ, ముందుకు పోతున్నామని చెప్పారు. తన 48 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సమస్యలు చూశామని ప్రస్తావించారు. అప్పట్లో నక్సలైట్ల సమస్య ఉండేదని చెప్పారు. తాను వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తుంటే, 23 క్లామోర్‌మైన్స్ పెట్టి చంపాలని చూశారని అన్నారు. తాను భయపడలేదని.. తాను ప్రజలకు చేసిన మంచి తనను కాపాడుతుందని భావించానని అన్నారు. రాయలసీమ రాజకీయ ముఠా కక్ష్యలు .. లేకుండా చేయాలని గట్టిగా తాము నిర్ణయించుకున్నామని.. వాటిని లేకుండా చేశామని తెలిపారు.



Click it and Unblock the Notifications