కొత్త స్కీమ్ ఎఫెక్ట్.. సగానికి పైగా కూలీలకు దక్కని పని!

గ్రామీణ పేదలకు కొండంత అండగా ఉండే ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన కొత్త మార్పులు క్షేత్రస్థాయిలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పథకం స్థానంలో ప్రభుత్వం ఇటీవలే కొత్త పేరు, కొత్త నిబంధనలతో 'వికసిత్ భారత్ - జీ రామ్ జీ' పథకాన్ని పట్టాలెక్కించింది. అయితే ఇది అమల్లోకి వచ్చిన మొదటి నెలలోనే ఉపాధి కూలీలకు గట్టి షాక్ తగిలింది. పల్లెల్లో ఉపాధి అవకాశాలు ఏకంగా సగానికి సగం తగ్గిపోయినట్లు అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి.

గత జులై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ నూతన ఉపాధి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. జులై నెల గణాంకాలను పరిశీలిస్తే, కూలీలకు కల్పించిన పని దినాల్లో ఏకంగా 49.94 శాతానికి పైగా కోత పడింది. గతేడాది జులైలో పాత పథకం కింద 15.33 కోట్ల పని దినాలు నమోదు కాగా, ఈ జులైలో కొత్త పథకం కింద అవి కేవలం 7.67 కోట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. చివరికి ఐదేళ్ల సగటుతో పోల్చి చూసినా ఇవి అత్యంత కనిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం.

Huge 50 Percent Decline in Rural Employment Generation After Transition to VB G RAM G Scheme

లక్షలాది కుటుంబాలకు దూరమైన పని

పని దినాలే కాకుండా, పథకం ద్వారా లబ్ధి పొందిన గ్రామీణ కుటుంబాల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. గతేడాది జులైలో దాదాపు 1.42 కోట్ల కుటుంబాలు ఉపాధి పనులు పొందగా, ఈసారి ఆ సంఖ్య కేవలం 68.94 లక్షలకు పడిపోయింది. అంటే ఏకంగా 51 శాతానికి పైగా పేద కుటుంబాలకు పని దొరకలేదని స్పష్టమవుతోంది. ఇది గత నాలుగేళ్ల సగటు పని పొందిన కుటుంబాల సంఖ్యలో 40 శాతం కంటే తక్కువ కావడం గమనార్హం.

Video: ఉపాధి హామీ కూలీల మైండ్ బ్లోయింగ్ డాన్స్. ఆనందం అంటే ఇదే!
Video: ఉపాధి హామీ కూలీల మైండ్ బ్లోయింగ్ డాన్స్. ఆనందం అంటే ఇదే!

వర్షాభావ వేళ రెట్టింపైన గ్రామీణ కష్టాలు

ఒకవైపు దేశవ్యాప్తంగా వర్షాలు సరిగ్గా పడక వ్యవసాయ పనులు మందగించాయి. దాదాపు సగానికి పైగా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గింది. పంట పొలాల్లో పనులు దొరకని సమయంలో గ్రామీణ పేదలు పూర్తిగా ఉపాధి హామీ పథకం పైనే ఆధారపడతారు. అలాంటి క్లిష్ట సమయంలోనే ఉపాధి పనులు కూడా నిలిచిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది.

పలుగు పట్టి.. పారెత్తి.. కరువు పనిలో దిగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్!
పలుగు పట్టి.. పారెత్తి.. కరువు పనిలో దిగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్!

సాగు సీజన్ వల్లేనా.. మరేదైనా కారణమా?

ఖరీఫ్ విత్తనాలు వేసే సీజన్ కావడంతోనే ఉపాధి పనుల్లో కొంత విరామం ఇచ్చి ఉంటారని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. కానీ పాత పథకం నుంచి కొత్త విధానంలోకి మారే క్రమంలో సాంకేతిక సమస్యలు, నిధుల విడుదల లేకపోవడం కూడా ఈ క్షీణతకు కారణమై ఉండవచ్చని తెలుస్తోంది. ఏది ఏమైనా కొత్త పథకం ప్రారంభంలోనే ఈ స్థాయిలో ఉపాధి పడిపోవడం పల్లెల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+