బాలినేని Vs దామచర్ల వివాదం వేళ హైకమాండ్ కీలక ఆదేశాలు - ఇక నుంచి..!!

కూటమికి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య రేగిన వివాదం పై కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఒంగోలు కేంద్రంగా మాజీ మంత్రి బాలినేని.. ప్రస్తుత ఎమ్మెల్యే దామచర్ల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఇద్దరూ పోటా పోటీగా సవాళ్లు చేయటం కూటమిలో సంచలనంగా మారింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇద్దరు నేతలు అక్రమాలు.. అవినీతి పైన చేస్తున్న వ్యాఖ్యలతో ఇద్దరికి చెందిన పార్టీల అధినాయకత్వం స్పందించింది. ఈ ఇద్దరికీ కీలక ఆదేశాలు జారీ చేసారు. దీంతో.. ఈ వివాదం ముగుస్తుందా... ఇంకా కొనసాగుతుందా అనేది కీలకంగా మారుతోంది.

బాలినేని Vs దాచమర్ల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ - తాజా పరిణామాలతో ఇక..!!
బాలినేని Vs దాచమర్ల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ - తాజా పరిణామాలతో ఇక..!!

ఒంగోలు కేంద్రంగా జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, తెదేపా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మధ్య నడుస్తున్న వివాదంపై రెండు పార్టీల హైకమాండ్‌లు తీవ్రంగా స్పందించాయి. కూటమికి నష్టం కలిగించేలా మాట్లాడవద్దని, ఇద్దరు నేతలు సంయమనం పాటించాలని టీడీపీ, జనసేన అధిష్ఠానాలు గట్టి ఆదేశాలు జారీ చేశాయి. ఈ ఇద్దరు నేతలు ఒకరిని మరొకరు టార్గెట్ చేస్తూ కొనసాగుతున్న డైలాగ్ వార్ పతాక స్థాయికి చేరింది.

TDP-Janasena Leadership Issues Crucial Directions to Balineni Damacharla Amidst War of Words here the details

గత ప్రభుత్వ హయాంలో బార్ షాపులను సిండికేట్ చేసి బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి కోట్ల రూపాయలు వసూలు చేశారని దామచర్ల ఆరోపించారు. బాలినేని చేసిన అక్రమాలపై కాణిపాకం గుడిలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని సవాల్ చేసారు. బాలినేని జనసేన పార్టీలో చేర కుండా ఉండి ఉంటే, గతంలో చేసిన పాపాలకు ఈపాటికే జైలుకు వెళ్లేవారని వ్యాఖ్యానించారు. దామచర్ల జనార్దన్ ఆరోపణలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అంతే ఘాటుగా స్పందించారు.

దామచర్ల ఒంగోలులో తన అనుచరులను మరియు జనసేన కార్యకర్తలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెట్టి వేధిస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, ఈ వివాదం పైన టీడీపీ - జనసేన నాయకత్వం స్పందించింది. కూటమి సమన్వయ కమిటీ సభ్యులు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఇద్దరు నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్, మంత్రి అచ్చెన్నాయుడు.. జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వ్యవహారంపై స్పందించారు.

ఎవరికైనా సమస్యలు లేదా ఆరోపణలు ఉంటే నేరుగా పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. కూటమి సమన్వయ కమిటీ సభ్యులు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఇద్దరు నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు, మాటల యుద్ధాలు పునరావృతం కావడానికి వీళ్లేదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో, ఈ ఇద్దరూ ఇక మౌనం దాల్చాలని సూచించారు. ఈ ఆదేశాలతో ఇద్దరు నేతలు హైకమాండ్ ను కలిసేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+