కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. హిజాబ్ ధరించేందుకు గ్రీన్ సిగ్నల్

2022 లో కర్ణాటకలో ప్రారంభమైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2022 లో అప్పటి బీజేపీ ప్రభుత్వం.. పాఠశాలల్లో, కళాశాలల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సిద్ధ రామయ్య ప్రభుత్వం అధికారికంగా ఉపసంహరించుకుంది. ఈ మేరకు 2022లో జారీ చేసిన పాఠశాల యూనిఫాం నిబంధనలను కొట్టివేసింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో హిజాబ్‌ తో పాటు జంధ్యాలు ధరించేందుకు విద్యార్థులకు అనుమతి లభించింది.

సిద్ధరామయ్య ప్రభుత్వం పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ.. విద్యార్థులు తమ యూనిఫామ్ తో పాటుగా పరిమిత సంప్రదాయ అలాగే ఆచార సంబంధిత చిహ్నాలను ధరించడానికి అనుమతిస్తూ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. అయితే పాఠశాలల్లో క్రమశిక్షణ, విద్యా వాతావరణానికి భంగం కలగకుండా ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. తాజాగా ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

Siddaramaiah Government Lift Hijab Ban in Karnataka Educational Institution Historic Move Announced

ఇక 2023 లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ఈ నిషేధాన్ని ఎత్తి వేస్తామని ప్రకటన చేసింది. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముడేళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరిలో అప్పటి బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ జీవో జారీ చేసింది. మార్చి 2022 న కర్ణాటక హైకోర్టు ఈ నిషేధాన్ని సమర్థించింది. ఇక అక్టోబర్ 2022 లో సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం హిజాబ్ వివాదంపై భిన్నమైన తీర్పులు ఇవ్వడంతో ఈ కేసు పెండింగ్ లో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+