తెలంగాణా రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి పొంగులేటి శుభవార్త.. రూ. 600 కోట్లతో వారికోసం!

తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది అని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి సుమారు 600 కోట్ల రూపాయలను కేటాయించి, 180 తహసిల్దార్, ఆర్డీవో భవనాలు నిర్మించనున్నట్టు రెవిన్యూ శాఖ మంత్రి పొంగి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

భూహక్కుల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పరిపాలన: మంత్రి పొంగులేటి

ధరణి స్థానంలో చట్టం తీసుకువచ్చి రైతులకు పూర్తి భూ హక్కులు, భద్రత కల్పించామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పేదల సంక్షేమం, రైతుల భూ హక్కుల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే తెలంగాణలోని రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Minister Ponguleti for Telangana revenue employees Rs 600cr allocated for statewide revenue offices

తహసీల్దార్ కార్యాలయ భవనానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. నేడు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి రూ.3.25 కోట్ల అంచనా వ్యయంతో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయ భవనానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

600 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో రెవెన్యూ భవనాలు

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ, వాటికి అవసరమైన కార్యాలయ భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. ఫలితంగా అనేకప్రాంతాల్లో మండలాలు ఉన్నా కార్యాలయ భవనాలు లేక ప్రజలు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించడానికి 600 కోట్ల రూపాయలను కేటాయించి భవనాలను నిర్మాణం చేస్తుందని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు.

రెండేళ్లలో ఆ పని పూర్తి చేస్తాం

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో తొలి విడతగా 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలోని ప్రతి అంగుళం భూమిని సర్వే చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి భూ పార్సిల్ కు గుర్తింపు కల్పించడంతోపాటు, భౌగోళిక కోఆర్డినేట్స్‌తో కూడిన మ్యాప్‌ను రూపొందించి అందించే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణా పోలీసులకు కొత్త సవాళ్లు, గతేడాది రూ.1700కోట్ల మోసం: డీజీపీ సీవీ ఆనంద్!
తెలంగాణా పోలీసులకు కొత్త సవాళ్లు, గతేడాది రూ.1700కోట్ల మోసం: డీజీపీ సీవీ ఆనంద్!

భూసర్వేతో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం

రైతులు, ప్రజల సహకారంతో భూ సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేసి భవిష్యత్తులో భూములకు సంబంధించి వివాదాలు, సమస్యలు తలెత్తకుండా పరిష్కరించుకోవాలన్నారు. భూ సమస్యలకు శాశ్వత భూ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమనిమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+