బాలినేని Vs దాచమర్ల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ - తాజా పరిణామాలతో ఇక..!!
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒంగోలు లో కూటమి కీలక నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. వైసీపీలో నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని- టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల మధ్య మరో సారి రాజకీయ పోరు తీవ్రమైంది. ఇద్దరూ సవాళ్లు చేసుకుంటున్నారు. ఒకరి పైన మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. బాలినేని అక్రమాల పైన ఆయన్ను అరెస్ట్ చేయిస్తానని దామచర్ల చెబుతున్నారంటూ.. బాలినేని మండి పడ్డారు. దామచర్లకు మరో సవాల్ చేసారు.
ఒంగోలు కేంద్రంగా బాలినేని వర్సస్ దామచర్ల పొలిటికల్ వార్ కొత్త టర్న్ తీసుకుంది. బాలినేని వైసీపీలో మంత్రిగా ఉన్న సమయం నుంచి ఈ ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది. బాలినేని జనసేనలో చేరినా.. కొంత కాలం ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. కొంత కాలం క్రితం పవన్ ను కలిసిన తరువాత పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో జనసేన బలో పేతం పైన బాలినేని ఫోకస్ చేసారు. అయితే, కూటమిలో బాలినేనికి ప్రాధాన్యత పైన దామచర్ల తొలి నుంచి అయిష్టంగానే ఉన్నారు. కూటమిలో రెండు పార్టీలు ఉండటంతో ఇక సమస్యలు ఉండవని భావించారు. అయితే, తాజాగా ఈ ఇద్దరి మద్య మొదలైన డైలాగ్ వార్ సవాళ్ల పర్వంగా మారిపోయింది. ఒకరి వ్యాఖ్యలకు మరొకరు ధీటుగా స్పందిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. తాజాగా దామచర్ల చేసిన వ్యాఖ్యల పైన బాలినేని సీరియస్ అయ్యారు. తనను జైలులో వేయిస్తానని దామచర్ల చెబుతున్నారని.. దమ్ముంటే తన పైన విచారణ చేయించాలని చంద్రబాబును కోరాలని బాలినేని సవాల్ చేసారు.

ఒంగోలు కేంద్రంగా కొత్త రాజకీయం
అదే విధంగా ప్రజా సమస్యలు, అభివృద్ధిపై ముఖాముఖీ చర్చకు సిద్దమని ప్రకటించారు. కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా ఉన్నప్పటికీ తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, అధికారులు సైతం ఏకపక్షంగా వ్యవహరిస్తు న్నారని సంచలన ఆరోపణలు చేశారు. దామచర్ల హయాంలో ఒంగోలులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, రాత్రి వేళల్లో సెటిల్మెంట్లు, అక్రమ వ్యవహారాలే నడుస్తున్నాయని బాలినేని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానికంగా ఇసుక ధరలు రూ. 3 వేల నుంచి రూ. 5 వేలకు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దమ్ముంటే కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి రావాలని, అలాగే తమ పదవులకు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థులుగా ఒంగోలు బరిలో తలపడదామని ఛాలెంజ్ చేసారు. తమకు ప్రాధాన్యత లేకపోయినా.. సర్దుకుపోతున్నామని తెలిపారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, ఒంగోలు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసమే తాము నిరంతరం శ్రమిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో.. ఈ ఇద్దరి మధ్య కొనసాగుతున్న డైలాగ్ వార్ పైన రెండు పార్టీల నాయకత్వాలు తీసుకునే చర్యల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.



Click it and Unblock the Notifications