తిరుమలలో భక్తులకు కొత్త అనుభూతి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఇక..!!
తిరుమలలో భక్తులకు కొత్త సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. భక్తుల సేవలను మరింతగా పెంచే క్రమంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కొత్త యాప్ తో పాటుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు ఎక్స్ పీరియన్స్ కేంద్రం ప్రారంభించారు. అదే విధంగా మ్యూజియం ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుపతి లో భక్తుల కోసం స్కై వాక్ కోసం కసరత్తు చేస్తున్నారు. ఇక.. తిరుమలలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం అయ్యాయి.
తిరుమలలో బ్రహ్మోత్సవాల వేళ భక్తుల కోసం కొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన వేళ వీటిని ప్రారంభించారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల నూతనంగా నిర్మించిన 'పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్'ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను చేకూర్చేలా, ప్రత్యేకంగా రూపొందించిన 'తిరుమల హీలింగ్, డివోషన్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రాన్ని' తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తెచ్చింది. తిరుమలలో పర్యావరణ పరిరక్షణను ప్రోత్స హించేలా నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన కొత్త ఈవీ బస్సుల సర్వీసులను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రఖ్యాత కార్పొరేట్ సంస్థలైన రిలయన్స్ గ్రూప్, భారత్ బయోటెక్ విరాళం గా అందించిన ఈ పర్యావరణ అనుకూల విద్యుత్ బస్సులు తిరుమలలోని స్థానిక భక్తుల రవాణాకు దోహదం చేయనున్నాయి.

భక్తుల కోసం కొత్త సదుపాయాలు
అదే విధంగా దేశవిదేశాల నుండి వచ్చే యాత్రికులకు కలియుగ వైకుంఠం విశిష్టతను, శ్రీవారి ఆలయ చరిత్రను అద్భుతంగా కళ్లకు కట్టేలా టీటీడీ అత్యాధునికంగా తీర్చిదిద్దిన 'శ్రీ వేంకటేశ్వర మ్యూజియం'ను కూడా ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభించారు. మరోవైపు తిరుమలకు వచ్చే సాధారణ భక్తులకు వసతి గదుల బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు సరికొత్త సాంకేతికతను జోడించారు. యాత్రికుల వసతి గదుల కేటాయింపు, లభ్యత తదితర వివరాలను పారదర్శకంగా పర్యవేక్షించేందుకు వీలుగా రూపొందించిన 'నందకం యాప్'ను ఆవిష్కరించారు. కాగా.. భక్తులకు బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇక.. టీటీడీ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లోనూ శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. తిరుపతిలో స్కై వాక్ నిర్మాణం పైనా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు.












Click it and Unblock the Notifications
