మమ్ముట్టి vs దుల్కర్ సల్మాన్: తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్!
మలయాళ సినిమా ఇండస్ట్రీలో అరుజైన, ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరుకు రంగం సిద్ధం అవుతోంది. మలయాళ చలనచిత్ర రంగానికి చెందిన దిగ్గజ నటుడు మమ్ముట్టి, ఆయన తనయుడు, స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలు ఒకే తేదీన బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. నవంబర్ 20న ఈ తండ్రీకొడుకుల సినిమాల మధ్య ప్రత్యక్ష సమరం జరగనుంది.
మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓం-చాప్టర్ 1: ఉధిరం" . కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరిసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా వంటి ప్రముఖులు నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్ 16నే విడుదల కావాల్సి ఉంది. రజనీకాంత్ 'జైలర్ 2' సినిమాతో క్లాష్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ సినిమాను నవంబర్ 20కి వాయిదా వేశారు.

మరోవైపు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా తెలుగు ప్రాజెక్టు 'ఆకాశంలో ఒక తార'. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. సీతారామం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ ఈ సారి సోలో హీరోగా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని చూస్తున్నారు. గీతా ఆర్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈ సినిమాకు అండగా నిలవడం విశేషం.
ఈ తండ్రీకొడుకుల సినిమాల మధ్య జరిగే ఈ బాక్సాఫీస్ పోరు రెండు ఇండస్ట్రీల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. 'ఓం' సినిమా తమిళం, మలయాళ మార్కెట్లలో బలమైన అంచనాలతో బరిలోకి దిగుతుండగా.. 'ఆకాశంలో ఒక తార' సినిమా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. నవంబర్ 20న తెరపైకి రానున్న ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications
