ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై మిసైల్ దాడి.. 11 మంది భారతీయులకు గాయాలు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హార్మూజ్ జలసంధిలోని ఒమన్ తీరంలో పనామా జెండా కలిగిన వాణిజ్య నౌకపై మిసైల్ దాడి జరిగింది. ఈ దాడిలో 11 మంది సిబ్బంది గాయపడ్డారు.
ప్రమాద సమయానికి నౌకలో మొత్తం 19 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 17 మంది భారతీయ నావికులేనని తెలుస్తోంది. వీరిలో 11 మంది భారతీయులు గాయాలపాలయ్యారు. వెంటనే ఒమన్ యంత్రాంగం సాయంతో వారిని ఒమన్ లోని కసాబ్ ప్రాంతానికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది.

"ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై జరిగిన క్షిపణి దాడిలో 12 మంది సిబ్బంది గాయపడ్డారు. వారిలో 11 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పనామా జెండా కలిగిన ఎంటీ ఆన్ పీస్ వాణిజ్య నౌక హార్మూజ్ జలసంధి దాటుతుండగా గుర్తు తెలియని క్షిపణి దాడిలో దెబ్బతింది" అని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు దాడి జరిగిన వెంటనే ఒమన్ ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించినందుకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది.
Statement on the attack on a commercial vessel MT On Peace, off the coast of Oman🔗 https://t.co/nuE2vv3x8k https://t.co/9KE13wy5UY
— Randhir Jaiswal (@MEAIndia) October 6, 2026
అలాగే హార్మూజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వరుస ఘటనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. " ఈ ప్రాంతంలో తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని మేము మరోసారి చెబుతున్నాం. ఇలాంటి ఘటనల వల్ల ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత దెబ్బతింటుంది" అని పేర్కొంది. అలాగే వాణిజ్య నౌకలను, పౌర ప్రయాణ నౌకలను కావాలనే టార్గెట్ చేయడం ఇక ముగించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో ఓ పోస్టు పెట్టారు. ఇక అక్టోబర్ 5 న నల్ల సముద్రంలో రోయడ్ మమ్మాదోవ్ అనే నౌక ఉక్రెయిన్ నుంచి మొక్కజొన్న సరుకును ఇటలీకు తీసుకెళ్తుండగా రష్యా డ్రోన్ లు దాడి చేశాయి. ఈ దాడిలో భారతీయ నావికులు ఇద్దరు మృతి చెందారు.












Click it and Unblock the Notifications
