Bypolls: తమిళనాడు, బెంగాల్ ఉపఎన్నికల్లో భారీ పోలింగ్-ఎక్కడెక్కడ ఎంతంటే ?
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రెండేసి అసెంబ్లీ స్ధానాల చొప్పున మొత్తం నాలుగు స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల (Bypolls) పోలింగ్ ముగిసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం ఐదు గంటల నాటికి నమోదైన పోలింగ్ శాతాల్ని ఎన్నికల సంఘం విడుదల చేసింది. తుది పోలింగ్ శాతాల్ని రేపు విడుదల చేసే అవకాశం ఉంది.
తమిళనాడులోని ధారాపురం , మధురాంతకం సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటర్లు ఇవాళ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. విజయ్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ఉపఎన్నికలు కావడంతో వీటిని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో సాయంత్రం 5 గంటల సమయానికి మధురాంతకం నియోజకవర్గంలో 83.86 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. అలాగే ధారాపురం స్ధానంలో 78.53 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది.

ఇక పశ్చిమ బెంగాల్లోని రెండు సీట్లలో ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో సీఎం సువేందు అధికారి ఖాళీ చేసిన నంది గ్రామ్ స్దానంలో 79.39 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. అలాగే మరో నియోజకవర్గం రెజీ నగర్ లోనూ 78.42 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రెండు సీట్లలోనూ విజయాన్ని సీఎం సువేందు అధికారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు రెజీ నగర్ స్ధానంలో పోటీకి దిగిన టీఎంసీ అభ్యర్దిని బలవంతంగా పోటీ నుంచి తప్పించారు. దీంతో టీఎంసీ కాంగ్రెస్ అభ్యర్ది మిలన్ ప్రధాన్ కు మద్దతిచ్చింది. దీంతో ఆయనపై పాత కేసులు తిరగతోడి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున ఓట్లు పోలవడం అధికార బీజేపీకి లాభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు అసోంలోని నాగోవ్ లోక్ సభ స్ధానానికి జరిగిన ఉపఎన్నికల్లో 70.25 శాతం పోలింగ్ నమోదైంది. అన్ని సీట్లకూ ఈ నెల 9న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.













Click it and Unblock the Notifications
