తమిళనాడు ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఓటర్ల తొలగింపే డీఎంకేను ముంచిందా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 ముగిసిన అనంతరం ఓటర్ల ముసాయిదా సవరణ(SIR) ప్రక్రియలో భారీగా ఓటర్ల పేర్లను తొలగించడమే తమ ఓటమికి కారణమని డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు టీవీకే పార్టీ విజయం వెనుక ఈ ఓటర్ల తొలగింపుల పాత్ర ఉందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

విజయ్, సువేందు సత్తాకు లిట్మస్ టెస్ట్..!!
విజయ్, సువేందు సత్తాకు లిట్మస్ టెస్ట్..!!
<strong style=ఓటర్ల తొలగింపులు, టీవీకే విజయం - లెక్కలివే!" title="ఓటర్ల తొలగింపులు, టీవీకే విజయం - లెక్కలివే!" loading="lazy" width="100" height="56" />
ఓటర్ల తొలగింపులు, టీవీకే విజయం - లెక్కలివే!

2026 ఏప్రిల్ నాటి ఓటర్ల జాబితాను పరిశీలిస్తే ఓటర్ల తొలగింపు తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో టీవీకే తక్కువ స్థానాలను గెలుచుకోగా.. అత్యధికంగా తొలగింపులు జరిగిన ప్రాంతాల్లో ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంది.

*10,000 లోపు తొలగింపులు ఉన్న 19 నియోజకవర్గాలు: డీఎంకే 7, ఏఐడీఎంకే 6, టీవీకే 2 మరియు ఇతరులు 4 స్థానాలు గెలుచుకున్నారు.

Tamil Nadu Election Result 2026 Did SIR Voter Deletions Help TVK Beat DMK Data Analysis Revealed

*10,000 నుంచి 20,000 మధ్య తొలగింపులు ఉన్న 80 నియోజకవర్గాలు: ఏఐడీఎంకే 24, టీవీకే 22, డీఎంకే 20, ఇతరులు 14 సీట్లను సాధించారు.

*20,000 నుంచి 30,000 మధ్య తొలగింపులు ఉన్న 66 నియోజకవర్గాలు: టీవీకే 32, డీఎంకే 21, ఏఐడీఎంకే 11, ఇతరులు 2 స్థానాల్లో గెలిచారు.

*30,000 నుంచి 50,000 మధ్య తొలగింపులు ఉన్న 37 నియోజకవర్గాలు: టీవీకే ఏకంగా 24 స్థానాలు గెలుచుకోగా, డీఎంకే 8, ఏఐడీఎంకే 5 స్థానాలకే పరిమితమయ్యాయి.

*50,000 నుంచి 80,000 మధ్య తొలగింపులు ఉన్న 22 నియోజకవర్గాలు: టీవీకే 18 చోట్ల విజయం సాధించగా, డీఎంకే 3, ఏఐడీఎంకే 1 స్థానంలో గెలిచాయి.

*80,000 కంటే ఎక్కువ తొలగింపులు ఉన్న 10 నియోజకవర్గాలు: ఈ 10 స్థానాలనూ టీవీకే మాత్రమే సొంతం చేసుకోవడం గమనార్హం.

మొత్తం మీద సగటున చూస్తే.. 2021లో ఏఐడీఎంకే గెలిచిన నియోజకవర్గాల్లో 27,000 తొలగింపులు జరగగా..డీఎంకే గెలిచిన స్థానాల్లో సగటున 31,000 తొలగింపులు నమోదయ్యాయి.

El nino: దేశంలో మళ్లీ కరెంట్ కట్.. 8 రాష్ట్రాలలో విపరీతమైన కోతలు!
El nino: దేశంలో మళ్లీ కరెంట్ కట్.. 8 రాష్ట్రాలలో విపరీతమైన కోతలు!

విశ్లేషకులు, రాజకీయ నాయకుల స్పందన
డీఎంకే ఎంపీ పి. విల్సన్ స్పందిస్తూ.. తమ పార్టీ ఓటర్లనే లక్ష్యంగా చేసుకుని కావాలనే పేర్లను తొలగించారని.. ఇది కేంద్ర ఎన్నికల సంఘం చేసిన కుట్ర అని తీవ్రంగా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టీవీకే జాతీయ ప్రతినిధి వివేక్ గుణనాథన్ ఖండించారు. ఓటర్ల తొలగింపులకు తమ విజయానికి సంబంధం లేదని, ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన పరిణామం మాత్రమేనని ఆయన తెలిపారు. సాంప్రదాయ పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకేలపై నమ్మకం కోల్పోయిన ప్రజలు తమ పార్టీ నాయకత్వాన్ని ఆదరించారని స్పష్టం చేశారు.

రాజకీయ విశ్లేషకులు బద్రి శేషాద్రి మాట్లాడుతూ.. కేవలం ఒకే రాజకీయ పార్టీ ఓటర్లను మాత్రమే ఏరికోరి తొలగించడం సాంకేతికంగా సాధ్యం కాదని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మాదిరిగా తమిళనాడులో ఏ పార్టీ క్షేత్రస్థాయి ఏజెంట్లు కూడా ముందస్తుగా ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని, కాబట్టి ఈ లెక్కల ఆధారంగా గూఢచారీ లేదా కుట్ర కోణాలను ఆపాదించలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+