'కోర్ట్' బ్యూటీ శ్రీదేవి కొత్త సినిమా ట్రైలర్ చూశారా..? 'కోర్ట్' కు మించిన సస్పెన్స్..!
కోర్ట్ మూవీతో తెలుగులో యువతకు దగ్గరైన హీరోయిన్ శ్రీదేవి అప్పాళ్ల. ఈ మూవీతో ఓవర్ నైట్ లోనే మంచి గుర్తింపు దక్కించుకుంది శ్రీదేవి. 2025 లో సైలెంట్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. చిన్న సినిమా స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. ఈ మూవీలో హర్ష్ రోషన్ హీరోగా నటించాడు. ఇక సినిమాలో హర్ష్ రోషన్- శ్రీదేవి కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దాంతో సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. అలాగే ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక కోర్ట్ మూవీ హిట్ తో అటు హర్ష్ రోషన్ కు ఇటు శ్రీదేవికి భారీగా అవకాశాలు వచ్చాయి. కోర్ట్ మూవీ తర్వాత వీరిద్దరూ కలిసి బ్యాండ్ మేళం అనే సినిమా చేశారు. అయితే ఈ మూవీ ఆశించినంత విజయం కాలేదు. కానీ రోషన్- శ్రీదేవి నటనకు మరోసారి మంచి గుర్తింపు లభించింది.

బ్యాండ్ మేళం తర్వాత శ్రీదేవి చేసిన సినిమా 'హైకూ' ఈ మూవీని కోలీవుడ్ దర్శకుడు యువరాజ్ చిన్నసామి తెరకెక్కించాడు. హైకూ చిత్రాన్ని విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డీ. అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మించారు. ఈ మూవీలో ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తూంటే ఈ మూవీ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ లో హీరో ఏగన్ తెలియకుండా ఓ మహిళా కాలేజీ లో చేరతాడు. ఆ కాలేజీలో అందరూ అమ్మాయిలే ఉంటారు. ఇతనొక్కడే అబ్బాయి. దాంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రీదేవి అతనికి పరిచయం అవుతుంది. అలా ఇద్దరూ లవ్ చేసుకుంటారు. ఏగన్ తో శ్రీదేవి పెళ్లి చేసుకుందామా.. ? అని కూడా అడుగుతుంది.
అయితే అదే సమయంలో ఏగన్ లైఫ్ లోకి ఫెమినా జార్జ్ వస్తుంది. ఆమె ఎవరు..? ఆమెకు ఏగన్ కు సంబంధం ఏంటి..? ఏగన్.. జార్జ్ తోనూ సన్నిహితంగా ఉంటాడు.. దాంతో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో చివరకు ఏం జరుగుతుంది..? అనే ఆసక్తికర కథాంశంతో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 23 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ యూత్ ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ మూవీలో కోర్ట్ కంటే బిగ్ హిట్ కొట్టాలని శ్రీదేవి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications
