Ashutosh Dixit: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు కొత్త బాస్.. పాక్ గుండెల్లో రైళ్లు..!!

పాకిస్థాన్, చైనా లాంటి సరిహద్దు దేశాలతో ముప్పు కొనసాగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత వైమానిక దళానికి కొత్త అధిపతిగా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ ను నియమించింది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చీఫ్ గా ఉన్న అమర్ ప్రీత్ సింగ్ 2026 అక్టోబర్ 31 న పదవీ విరమణ చేయనున్నారు.

ఆయన స్థానంలో ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక అశుతోష్ దీక్షిత్ కు వైమానిక రంగంలో 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఫైటర్, ట్రాన్స్ పోర్ట్, ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ లను నడపడంలో ఆయన్ను అత్యద్భుతమైన నిపుణుడిగా చెబుతుంటారు. ఆయనకు 3,500 గంటల ఫ్లైయింగ్ అనుభవం ఉంది. అశుతోష్ దీక్షిత్ తన సుదీర్ఘ అనుభవంలో తేజాస్, మిరేజ్-2000, జాగ్వార్, అలాగే అనేక మిగ్ విమానాలను నడిపిన అనుభవం ఆయన సొంతం. అశుతోష్ దీక్షిత్ నియామకంతో పాకిస్థాన్ వైమానిక దళం అలెర్ట్ అయినట్లు సమాచారం.

ashutoshdixitAir Marshal is the new Chief of the Indian Air Force 3 500 hours of flying experience

ఇక భారత వైమానిక దళం అక్టోబర్ 8న 94 వ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యానివర్సరీ జరుపుకుంటున్న తరుణంలో అశుతోష్ దీక్షిత్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన 1984 లో ఐఏఎఫ్ లో చేరారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ది డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీ, నేషనల్ డిఫెన్స్ కాలేజీకి అలుమ్నస్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ రక్షణ్, కోప్ ఇండియా, ఆపరేషన్ సింధూర్ లాంటి కీలకమైన ఆపరేషన్ల విజయంలో కీలకపాత్ర పోషించారు. దేశీయ ఏవియేషన్ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడంలో అశుతోష్ దీక్షిత్ కీలకంగా వ్యవహరించారు. కొత్త ఐఏఎఫ్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక ఇండియన్ ఏవియేషన్ రంగంలో మరిన్ని సంస్థాగత మార్పులను తీసుకొచ్చే అవకాశం ఉందని.. దేశీయ ఏవియేషన్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐఏఎఫ్ కు కొత్త బాస్ రావడంతో పాకిస్థాన్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+