కెప్టెన్సీ నుంచి హర్మన్‌ప్రీత్ అవుట్.. బీసీసీఐ నిర్ణయం వెనుక అసలు కథ ఇదే!

భారత మహిళల క్రికెట్ జట్టులో ఓ కీలక శకం ముగిసింది. దశాబ్ధ కాలంగా జట్టును విజయవంతంగా నడిపించిన ఆల్ ఫార్మాట్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జట్టులో మార్పులు తీసుకురావాలని బీసీసీఐ భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఆమె కేవలం సాధారణ ప్లేయర్‌గా మాత్రమే భారత జట్టులో కొనసాగనున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ వైదొలగడంతో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తదుపరి భారత మహిళల జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్ అయ్యే అవకాశాలు బలపడ్డాయి.

కెప్టెన్సీకి గుడ్‌బై .. హర్మన్‌ప్రీత్ సంచలన నిర్ణయం!
కెప్టెన్సీకి గుడ్‌బై .. హర్మన్‌ప్రీత్ సంచలన నిర్ణయం!

ఈ మార్పుకు సంబంధించి తెరవెనుక జరిగిన పరిణామాలపై ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆసియా క్రీడలు ముగిసిన వెంటనే బీసీసీఐ మహిళల జట్టుతో ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. గౌహతి వేదికగా జరిగిన ఈ సమావేశంలో బీసీసీఐ కార్యదర్శ దేవజిత్ సైకియా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పాల్గొన్నారు. ఈ సమావేశంలో బోర్డు వర్గాలు స్పందిస్తూ.. రాబోయే కాలానికి కొత్త నాయకులను తయారు చేయాల్సిన అవసరం ఉందని, నాయకత్వంలో మార్పు కోరుకుంటున్నామని సెలెక్టర్లు, అధికారులకు తేల్చిచెప్పారు.

Harmanpreet Kaur Steps Down as Captain Inside BCCI Decision paving the way for Smriti Mandhana

అయితే ఈ సమావేశంలో హర్మన్‌ప్రీత్ కౌర్ వెంటనే కెప్టెన్సీని వదులుకోవడానికి ఇష్టపడలేదని సమాచారం. జట్టుకు తన అనుభవం ఎంతో అవసరమని, అన్ని ఫార్మాట్లలోనూ లీడర్‌గా కొనసాగడానికి తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వన్డే, టెస్ట్ జట్లకు తనకే కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. అయితే టీ20 ఫార్మాట్లో తన వ్యక్తిగత బ్యాటింగ్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని గుర్తించిన ఆమె.. ఆ ఒక్క ఫార్మాట్లో యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడానికి తప్పుకునేందుకు అంగీకరించారు. అయినప్పటికీ అన్ని ఫార్మాట్లలోనూ సమూల మార్పులు తీసుకురావాలన్న తన పట్టును బీసీసీఐ సడలించలేదు.

IND vs WI: వైభవ్ ఔట్, సంజుకు లక్కీ ఛాన్స్! తొలి టీ20లో అసలు డ్రామా ఇదే!
IND vs WI: వైభవ్ ఔట్, సంజుకు లక్కీ ఛాన్స్! తొలి టీ20లో అసలు డ్రామా ఇదే!

భారత మహిళల క్రికెట్ చరిత్రలో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. 2016లో టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన ఆమె.. ఆ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె సారథ్యంలోనే భారత్ 2025లో వన్డే ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. జట్టుకు తొలి ఐసీసీ ట్రోఫీని అందించింది. అలాగే ఆమె నాయకత్వంలోనే భారత జట్టు రెండుసార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలను గెలుచుకుంది. అంతే కాకుండా 2020లో తొలిసారిగా మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు భారత్ చేరుకోవడంలోనూ హర్మన్‌ప్రీత్ కౌర్ పాత్ర ఎంతో కీలకమైనది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+