KCR ఫామ్‌హౌస్‌పై సీఎం సంచలన ఆదేశాలు! 22ఏ సమస్యలపై త్వరలోనే కొత్త పాలసీ..

తెలంగాణ శాసనసభ వేదికగా భూ ఆక్రమణలు, 22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను లక్ష్యంగా చేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలో ఉన్న 340 ఎకరాల ప్రభుత్వ భూమిపై తక్షణమే విచారణ జరిపాలని, సంబంధిత రెవెన్యూ అధికారులు వెంటనే కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోని భూములపై విచారణను 30 రోజుల్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన గడువు విధించారు. విచారణలో ఆ స్థలం ప్రభుత్వ భూమిగా నిర్ధారణ అయితే, దానిని స్వాధీనం చేసుకుని పేద దళితులకు పంపిణీ చేస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విచారణ ప్రక్రియలో ఏమాత్రం అలసత్వం వహించినా, సకాలంలో ప్రక్రియ పూర్తి చేయకుంటే బాధ్యులైన అధికారులు, మంత్రులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేసీఆర్ ధరణి పేరిట వేల ఎకరాలను కొల్లగొట్టారని, ఆ దందాల చిట్టా బయటపడుతుందనే భయంతోనే 'బబుల్ షూటర్' సలహాతో కేసీఆర్ సభ నుంచి పారిపోయారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

Telangana CM Revanth Reddy Orders Probe Into KCR Farmhouse Lands Directs Notice Over 340 Acres Allegation

తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమ-సింగపూర్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు..!
తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమ-సింగపూర్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు..!

ధరణి దందాలు, రికార్డుల కుట్రపై విచారణ!

2010లో ఒడిశాలో ప్రారంభమైన ధరణి పోర్టల్‌ను కాగ్ తిట్టిపోసినా.. కేసీఆర్ తన స్వార్థం కోసం తెలంగాణకు తీసుకొచ్చి లక్షల కోట్ల విలువైన ఆస్తులను కొందరి చేతుల్లోకి మార్చారని సీఎం విమర్శించారు. మండల స్థాయిలో ఉన్న భూ రికార్డులను డిజిటలైజేషన్ పేరుతో కలెక్టరేట్లకు తరలించి పెద్ద ఎత్తున కుట్ర చేశారని, భూదాన్ భూములను సైతం ఆక్రమించారని మండిపడ్డారు. భూముల కోసం పోరాటం చేసింది ఎర్రజెండా అయితే, పేదలకు భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. భూముల సమస్య నిజాం కాలం నుండి ఎలా వచ్చిందనే దానిపై సమగ్ర చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

22ఏ సమస్యలపై త్వరలోనే కొత్త పాలసీ.. శాశ్వత పరిష్కారం!

22ఏ నిషేధిత భూముల విషయంలో ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను సీఎం తిరస్కరించారు. 22ఏ సమస్యల్లో 12 ప్రధాన అంశాలను ప్రభుత్వం గుర్తించిందని, అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములు, పట్టణ భూ క్రమబద్ధీకరణపై త్వరలోనే నూతన విధానాన్ని తీసుకువస్తామని ప్రకటించారు. భూముల రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ ఏకకాలంలో పూర్తి చేస్తామని, అధీకృత లేఅవుట్లలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో కొత్త గైడ్‌లైన్స్ ఇచ్చి పరిష్కరిస్తామన్నారు. జీవో 118 పెండింగ్ దరఖాస్తులను, సింగరేణి ప్రాంతంలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+