పసిడి ప్రియులకు ధమాకా- గోల్డ్ రేట్ డౌన్
దేశంలో బంగారం, వెండి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటోన్న పరిణామాలు, అమెరికా డాలర్ విలువలో మార్పులు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల ప్రభావం దేశీయంగా బంగారం, వెండి ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 0.05 శాతం తగ్గుదల కనిపించింది. వెండి ధర 0.33 శాతం వరకు తగ్గింది. పండగ సీజన్ లో బంగారం, వెండి ధరలు తగ్గినప్పటికీ.. అవి నామమాత్రమే.
నవంబర్ 5 నాటి గడువు గల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,49,638 వద్ద ట్రేడ్ కాగా, డిసెంబర్ 4 గడువు కలిగిన వెండి ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కిలోకు రూ. 2,24,391 వద్ద కొనసాగాయి. సోమవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 160, 22 క్యారెట్లు రూ. 150, 18 క్యారెట్లు రూ. 120 మేర తగ్గింది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు బులియన్ మార్కెట్లో అనిశ్చితికి కారణమౌతోన్నాయి.

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,430 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్లు రూ.1,36,948 పలకింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,100 కాగా, 22 క్యారెట్లు రూ.1,36,675 వద్ద నిలిచింది. చెన్నైలో ఇవే ధరలు వరుసగా రూ. 1,49,620, రూ.1,37,152, వద్ద కొనసాగాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,310, 22 క్యారెట్లు రూ.1,36,868 వద్ద స్థిరపడింది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,902, 22 క్యారెట్లు - రూ. 13,660, 18 క్యారెట్లు - రూ. 11,220
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,902, 22 క్యారెట్లు- రూ. 13,660, 18 క్యారెట్లు - రూ. 11,177
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,902, 22 క్యారెట్లు- రూ. 13,660, 18 క్యారెట్లు - రూ. 11,177
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,902, 22 క్యారెట్లు- రూ. 13,660, 18 క్యారెట్లు - రూ. 11,177
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,902, 22 క్యారెట్లు- రూ. 13,660, 18 క్యారెట్లు - రూ. 11,177
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,902, 22 క్యారెట్లు- రూ. 13,660, 18 క్యారెట్లు - రూ. 11,177

Click it and Unblock the Notifications