13 కోట్ల ఓట్ల గాయబ్? దేశ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద మోసం!

దేశ రాజధాని ఢిల్లీ వీధులు అట్టుడికిపోతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ ప్రతిపక్ష 'ఇండియా' కూటమి ఎంపీలు, అగ్రనేతలు భారీ నిరసన ర్యాలీతో రోడ్లపైకి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌లు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హస్తినలో ఉద్రిక్త వాతావరణం నడుమ ఎన్నికల సంఘం కార్యాలయం నిర్వాచన్ సదన్ వైపు మార్చ్ నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని, భారత రాజకీయ చరిత్రలోనే ఇది అతిపెద్ద కుట్ర అని విపక్ష నేతలు ఆరోపించడంతో కేంద్రం, ప్రతిపక్షాల నడుమ పోరు మరింత ముదిరింది.

కాంగ్రెస్ నేత పి. చిదంబరం మాట్లాడుతూ.. "బీజేపీకి హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ చదవడం రాదు. ఫారం 6లో ఎలాంటి మార్పులను ఆమోదించలేదని సీజేఐ స్పష్టంగా చెప్పారు. ఇది ఓపెన్ కోర్ట్‌లో జరిగిన విషయం. బార్‌ కౌన్సిల్ మెంబర్లు, బెంచ్‌ సభ్యులు కూడా ఆ ప్రకటనను నమోదు చేశారు. మరి బీజేపీ ఇంత బహిరంగంగా ఎలా ఖండించగలదు? ఫారం 6లో ఆ డిక్లరేషన్‌ను నిజంగానే అదనంగా చేర్చారని మండిపడ్డారు.

Opposition INDIA Bloc Marches to Election Commission Demands Resignation of PM Modi and CEC

13 కోట్ల ఓట్ల తొలగింపు.. చరిత్రలోనే అతిపెద్ద మోసం!

ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ ధరంవీర్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో దేశవ్యాప్తంగా ఏకంగా 13 కోట్ల ఓటర్ల పేర్లను తొలగించారని, ఇది కోట్లాది మంది పౌరుల ప్రాథమిక ఓటు హక్కును హరించడమేనని తీవ్రంగా ధ్వజమెత్తారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ సహకారంతోనే ఈ భారీ దగా జరిగిందని ఆరోపిస్తూ, రాజ్యాంగ బద్ధ సంస్థల స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Form 6 మార్పు: కమిషనర్ల అభ్యంతరాలు-ఈసీ సమర్ధన-చివరికి సుప్రీం బిగ్ ట్విస్ట్..!
Form 6 మార్పు: కమిషనర్ల అభ్యంతరాలు-ఈసీ సమర్ధన-చివరికి సుప్రీం బిగ్ ట్విస్ట్..!

రాజ్యాంగ సంస్థల హత్యా ప్రయత్నం..

ప్రతిపక్షాలు రాజ్యాంగ సంస్థల ప్రతిష్టను దిగజారుస్తున్నాయన్న బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలిగించిందే అధికార పక్షమని, దర్యాప్తు సంస్థల నుంచి మీడియా వరకు అన్నింటినీ తమ సొంత జేబు సంస్థలుగా మార్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. తక్షణమే వివాదాస్పద ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేసి, తొలగించిన ఓటర్ల పేర్లను మళ్లీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఓట్ల చౌర్యంతో అధికారాన్ని దక్కించుకోవడానికి వెనుక ఉండి నడిపించిన సూత్రధారులపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు.

CEC ని తొలగించాల్సిందే-ఇండీ కూటమి తీర్మానం..! డీఎంకే, ఆప్ ట్విస్టులు ..!
CEC ని తొలగించాల్సిందే-ఇండీ కూటమి తీర్మానం..! డీఎంకే, ఆప్ ట్విస్టులు ..!

ముదిరిన రాజకీయ సంక్షోభం.. పతాక స్థాయికి విపక్షాల ఉద్యమం

ఈ అక్రమాలు కేవలం విపక్షాల ఆరోపణలు మాత్రమే కావని, స్వయంగా ఎన్నికల కమిషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కమిషనర్లే ఈ విషయాన్ని బయటపెట్టారని, ఆ తర్వాత కోర్టులు కూడా స్పందించాయని నసీర్ హుస్సేన్ గుర్తుచేశారు. ఎన్నికల నిర్వహణ వ్యవస్థపై విశ్వసనీయత దెబ్బతిన్న నేపథ్యంలో 'సేవ్ డెమోక్రసీ' పేరుతో దేశవ్యాప్త ఉద్యమానికి ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలతో రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, ఎన్నికల సంఘం ముందు తమ డిమాండ్లను గట్టిగా వినిపించేందుకు విపక్షాలు సమరశంఖం పూరించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+